ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సహకరించావా సరే.. లేదంటే మరో 20 మందిని తీసుకొస్తా: గర్భిణిపై రష్యా సైనికుడి అఘాయిత్యం

ABN, First Publish Date - 2022-04-29T01:40:19+05:30

ఉక్రెయిన్‌పై దురాక్రమణకు పాల్పడుతున్న రష్యా సేనల ఆగడాలు మితిమిరీ పోతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కీవ్: ఉక్రెయిన్‌పై దురాక్రమణకు పాల్పడుతున్న రష్యా సేనల ఆగడాలు మితిమిరీ పోతున్నాయి. ఖేర్సన్‌లోని ఓ గ్రామంలో రష్యా సైనికుడు ఒకరు 16 ఏళ్ల గర్భిణిపై దారుణానికి తెగబడ్డాడు. తనకు సహకరించాలని, లేదంటే మరో 20మందిని తీసుకొస్తానని హెచ్చరించి మరీ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఉక్రెయిన్‌ను క్రమంగా తమ నియంత్రణలోకి తెచ్చుకుంటున్న రష్యా సేనల అకృత్యాలకు ఇది నిదర్శనం.


బాధిత బాలికపై అత్యాచారం జరిగిన సమయంలో ఆమె ఆరు నెలల గర్భిణి. మద్యం మత్తులో ఉన్న సైనికుడు తన గొంతు పట్టుకుని తనకు సహకరించకుంటే చంపేస్తానని హెచ్చరించాడని బాధితురాలు తెలిపింది. రష్యా సేనల బాంబుల వర్షం నుంచి తప్పించుకునేందుకు బాధిత బాలిక కుటుంబం ఇంటి బేస్‌మెంట్‌తో ఉంటోంది. ఆహారం కోసం వారు బయటకు వచ్చినప్పుడు మద్యం తాగి ఉన్న రష్యా సైనికుడు వారిని గుర్తించాడు. 


అతడు వారి వద్దకు వెళ్లి పిల్లల వయసెంతని ప్రశ్నించాడు. దానికామె.. ఇద్దరు అమ్మాయిల వయసు 12, 14 ఏళ్లని, తన వయసు 16 ఏళ్లని చెప్పింది. తొలుత అతడు తన తల్లిని పిలిచాడని, ఆ తర్వాత ఆమెను విడిచిపెట్టి తనను పిలిచాడని బాధితురాలు తెలిపింది. తాను వెళ్లగానే గట్టిగా అరుస్తూ దుస్తులు విప్పేయాలని కోరాడని చెప్పింది. తాను నిరాకరించడంతో ఆగ్రహంతో ఊగిపోయాడని, తనకు సహకరించకుంటే మరో 20 మందిని తీసుకొస్తానని హెచ్చరించాడని తెలిపింది. అంతేకాదు, అత్యాచారాన్ని ప్రతిఘటిస్తే గొంతు నులిమి చంపేస్తానని హెచ్చరించాడని కన్నీళ్లు పెట్టుకుంది. అయితే, ఇది గమనించిన మరో సైనికుడు జోక్యం చేసుకుని తనను వదిలిపెట్టాలని సహచరుడిని కోరాడని, కానీ అతడు నిరాకరించాడని బాధితురాలు వివరించింది.


తనపై అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తికి నీలి కళ్లు ఉన్నట్టు బాధితురాలు గుర్తు చేసుకుంది. అంతకుమించి మరేమీ గుర్తులేదని చెప్పింది. తాము తినడానికి బయటకు రాకుంటే అతడు తమను చూసేవాడు కాదని, ఈ ఘోరం జరిగి ఉండేది కాదని బోరుమంది. అంతేకాదు, ఆ మరుసటి రోజు మరో సైనికుడి దగ్గరకు ఆమెను తీసుకెళ్లారు. అతడు కూడా ఆమెపై అత్యాచారం చేస్తానని బెదిరించాడు. దీంతో భయపడిపోయిన ఆమె ఏడుపు లంకించుకుంది. దీంతో ఆమె చెబుతున్నది నిజమా? అబద్ధమా? అని తెలుసుకునేందుకే అలా భయపెట్టానని చెప్పడంతో ఆమె కుదుటపడింది. గ్రామానికి రష్యన్ సేనలు ఆక్రమించిన తర్వాత యుద్ధ నేరాలు, పిల్లలపై అత్యాచారాలు జరుగుతున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 

Updated Date - 2022-04-29T01:40:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising