ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆవుల చర్మంపై ఇలాంటి మచ్చలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకండి.. కరోనా వైరస్‌లా ఒకదాని నుంచి మరో దానికి.. చివరకు..

ABN, First Publish Date - 2022-07-20T01:11:51+05:30

రాజస్థాన్ రాష్ట్రంలోని బార్మర్ జిల్లాలోని జంతువుల్లో చర్మ వ్యాధి చాలా వేగంగా విస్తరిస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజస్థాన్ రాష్ట్రంలోని బార్మర్ జిల్లాలోని జంతువుల్లో చర్మ వ్యాధి చాలా వేగంగా విస్తరిస్తోంది. ఆవులు, ఎద్దులు, ఇతర జంతువులు ఈ వైరల్ వ్యాధి బారిన పడుతున్నాయి. ఈ వ్యాధి బారిన పడిన జంతువులు చాలా బాధలు పడి చనిపోతున్నాయి. ఈ వ్యాధి కరోనా వైరస్ కంటే వేగంగా వ్యాపిస్తోంది. ఇది ఒక జంతువు నుంచి మరో జంతువుకు వేగంగా సోకుతోంది. ఇది వైరస్ ద్వారా సంక్రమించే అంటు వ్యాధి. ఈ వ్యాధి ఆవులు, ఎద్దులు, గేదెలలో ఎక్కువగా వ్యాపిస్తోంది. ఈ వ్యాధి జంతువుల ప్రాణాలను భారీగా హరిస్తోందని బార్మర్ పశుసంవర్థక శాఖ చెబుతోంది. 


ఇది కూడా చదవండి..

తాగిన మత్తులో భార్య ఎవరో.. అత్త ఎవరో గుర్తించలేకపోయిన మందుబాబు.. చివరకు జరిగిన ఘోరమిదీ..!


చాలా జంతువులు ఈ వ్యాధితో బాధపడుతున్నాయని శివ్ ప్రాంతంలోని పశుసంవర్థక సంస్థ తెలిపింది. ఇతర జంతువులతో పోల్చుకుంటే ఈ వ్యాధి ఎక్కువగా ఆవులలో వ్యాపిస్తుంది. వ్యాధి సోకిన జంతువును సకాలంలో గుర్తించి చికిత్స అందిస్తే ప్రాణాపాయం తప్పుతుందని వైద్యులు చెబుతున్నారు. ఆహారం, నీళ్లు తరచుగా ఇస్తూ చికిత్స అందిస్తే వ్యాధికి గురైన జంతువులను రక్షించవచ్చని చెప్పారు. ఈ వ్యాధి యొక్క మొదటి లక్షణం జంతువులలో జ్వరం అని, అలాగే చర్మంపై గడ్డలు, నోటిలో బొబ్బలు కూడా ఉంటాయని డాక్టర్లు చెబుతున్నారు. జంతువు మేత ఆగిపోతుంది. 


జంతువులలో ఇలాంటి లక్షణాలు కనిపించిన వెంటనే సమీపంలోని పశువైద్యులను సంప్రదించి సకాలంలో వైద్యం అందించాలని పశుసంవర్థక శాఖ విజ్ఞప్తి చేసింది. వ్యాధి సోకిన జంతువుల యజమానులు, వాటికి చికిత్స చేసిన వైద్యులు తరచుగా సబ్బుతో చేతులు కడుక్కోవాలని సూచించింది.


Updated Date - 2022-07-20T01:11:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising