ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒకే ఇంట్లో 6 మృతదేహాలు.. పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పేందుకు మేనమామ ఫోన్ చేస్తే నో రెస్పాన్స్.. ఇంటికెళ్లి చూస్తే..

ABN, First Publish Date - 2022-08-26T19:55:41+05:30

తన సోదరి కూతురు జన్మదినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు చెప్పడానికి అతను ఫోన్ చేశాడు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తన సోదరి కూతురు జన్మదినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు చెప్పడానికి అతను ఫోన్ చేశాడు.. ఎన్ని సార్లు ఫోన్ చేసినా అవతలి నుంచి స్పందన లేదు.. ఏం జరిగిందో ఏంటో అని అతను నేరుగా సోదరి ఇంటికి వెళ్లాడు.. ఇంటి లోపలికి వెళ్లి చూసి షాకయ్యాడు.. ఆ కుటుంబ సభ్యులందరూ విగత జీవులుగా పడి ఉన్నారు.. ఆరోజు పుట్టిన రోజు జరుపుకోవాల్సిన ఐదేళ్ల పాపతో పాటు మొత్తం ఆరుగురి మృతదేహాలు లోపల పడి ఉన్నాయి.. దీంతో అతను వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు. 



ఇది కూడా చదవండి..

Viral Video: కూతురి కాళ్లను పాలతో కడిగి వాటిని తాగిన తల్లిదండ్రులు.. కారణమేంటంటే..


హర్యానా (Haryana)లోని అంబాలా జిల్లా బాలనా గ్రామానికి చెందిన సుఖ్వీందర్ సింగ్ ఆటోమొబైల్ కంపెనీలో పనిచేసేవాడు. ఈ రోజు (శుక్రవారం) సుఖ్వీందర్ కూతురు ఆశు ఆరో జన్మదినోత్సవం. దీంతో ఆశుకు విష్ చేద్దామని మేనమామ ఫోన్ చేస్తే ఎవరూ స్పందించలేదు. ఇంటికి వెళ్లి చూడగా అందరూ చనిపోయి ఉన్నారు.  సుఖ్వీందర్ మొదట తన తల్లిదండ్రులను, భార్యను, పిల్లలను హతమార్చి ఉంటాడని, ఆ తర్వాత ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. సుఖ్వీందర్ మృతదేహం వద్ద ఉన్న సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. 


పది లక్షల రూపాయల అప్పు తీర్చలేక తాము చనిపోతున్నట్టు సుఖ్వీందర్ ఆ లేఖలో రాసినట్టు సమాచారం. పోలీసులు ఇంకా పూర్తి వివరాలు వెల్లడించలేదు. పోస్ట్‌మార్టమ్ నివేదిక వచ్చిన తర్వాత ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు చెబుతున్నారు. 


Updated Date - 2022-08-26T19:55:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising