ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒకే కుటుంబానికి కోడళ్లుగా వెళ్లిన అక్కాచెల్లెళ్లు.. నాలుగు రోజుల తర్వాత వారి పరిస్థితి ఏంటంటే..

ABN, First Publish Date - 2022-04-05T15:52:32+05:30

ఆ అక్కాచెల్లెళ్లు ఇద్దరికీ ఒకే కుటుంబానికి చెందిన అన్నాదమ్ములతో పెళ్లిళ్లు కుదిరాయి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆ అక్కాచెల్లెళ్లు ఇద్దరికీ ఒకే కుటుంబానికి చెందిన అన్నాదమ్ములతో పెళ్లిళ్లు కుదిరాయి.. ఒక వేదికపై ఇద్దరికీ ఘనంగా వివాహాలు జరిగాయి.. ఎంతో సంతోషంతో, ఎన్నో కలలతో వారిద్దరూ అత్తింట అడుగు పెట్టారు.. అయితే వారి సంతోషం నాలుగు రోజుల్లోనే ఆవిరైంది.. అన్నాదమ్ములు ఇద్దరిలో ఒకడు నపుంసకుడు అని తేలింది.. వధువు గొడవ చేయడంతో అత్తింటి వారు కట్నం డిమాండ్ చేసి అమ్మాయిలను చితక్కొట్టి, ఇంటి నుంచి బయటకు గెంటేశారు. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. 


మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చెందిన భావన జోషి, ఆమె సోదరి తరుణ జోషి (22) సోమవారం ఉదయం స్థానిక మహిళా పోలీస్ స్టేషన్‌కు చేరుకుని తమ భర్తలపై ఫిర్యాదు చేశారు. వీరికి 2020 ఫిబ్రవరి 25న ఒకే కుటుంబానికి చెందిన అన్నాదమ్ములతో వివాహాలు జరిగాయి. గుల్షన్ జోషిని భావన, ఛోటూ జోషిని తరుణ వివాహాలు చేసుకున్నారు. ఎన్నో ఆశలతో అత్తింట అడుగుపెట్టారు. అయితే వివాహం జరిగిన తర్వాత ఛోటూ జోషి నపుంసకుడని బయటపడింది. దీంతో తరుణ గొడవ పడింది. తమ పరువు పోతుందనే భయంతో తగినంత కట్నం ఇవ్వలేదని సాకు చెప్పి అక్కాచెల్లెళ్లను అత్తింటి వారు కొట్టారు. 


నెల రోజుల తర్వాత వారిద్దరినీ ఇంటి నుంచి బయటకు గెంటేశారు. దీంతో వధువు తల్లిదండ్రులు ఇరు కుటుంబాల పెద్దలతో పలుసార్లు పంచాయితీలు నిర్వహించారు. అయినా రాజీ కుదురకపోవడంతో అక్కాచెల్లెళ్లు ఇద్దరూ సోమవారం ఉదయం స్థానిక పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. 

Updated Date - 2022-04-05T15:52:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising