ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: స్విమ్మింగ్‌పూల్‌లో ఈత కొడుతున్న జనం.. చూస్తుండగానే నీళ్లన్నీ మాయం.. ఎవరూ ఊహించని ఘోరం..!

ABN, First Publish Date - 2022-07-26T00:35:56+05:30

ఇజ్రాయేల్ (Israel)లోని ఓ ఇంట్లో నిర్వహించిన పార్టీ విషాదానికి కారణమైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇజ్రాయేల్ (Israel)లోని ఓ ఇంట్లో నిర్వహించిన పార్టీ విషాదానికి కారణమైంది. స్విమ్మింగ్ పూల్‌ (Swimming pool)లోకి దిగి ఆనందంగా గడుపుతున్న బంధువులకు ఒక్కసారిగా షాక్‌ తగిలింది. పార్టీ సమయంలో కొందరు వ్యక్తులు స్విమ్మింగ్‌పూల్‌లోకి దిగి ఈత కొడుతుండగా ఒక్కసారిగా పూల్ మధ్యలో సింక్‌హోల్‌ (sink hole) తెరుచుకుంది. దీంతో పూల్‌లోని నీరు వేగంగా సింక్‌హోల్‌లోకి వెళ్లింది. ఆ నీటితో పాటు ఓ వ్యక్తి కూడా దానిలో పడిపోయాడు. సుమారు 43 అడుగుల లోతైన గుంత కావడంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. అతడిని కాపాడేందుకు ప్రయత్నించి మరో వ్యక్తి గాయాలపాలయ్యాడు. 


ఆ షాకింగ్‌ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌(Viral Video) గా మారాయి. ఈ సంఘటన ఇజ్రాయెల్‌లోని కర్మీ యోసెఫ్‌ నగరంలో గురువారం జరిగింది. ఈ ఘటనలో 30 ఏళ్ల కిమ్హీ ప్రాణాలు కోల్పోయినట్టు పోలీసులు తెలిపారు. అతడిని కాపాడేందుకు యత్నించిన 34 ఏళ్ల వ్యక్తికి స్వల్పగాయాలైనట్లు చెప్పారు. ప్రమాదం జరిగిన సమయంలో స్విమ్మింగ్‌ పూల్‌లో మొత్తం ఆరుగురు ఉన్నారు. మిగిలిన వారు ప్రమాదాన్ని గుర్తించి వెంటనే పైకి వెళ్లిపోవడం వల్ల సురక్షితంగా బయటపడ్డారు. నిర్లక్ష‍్యంగా వ్యవహరించి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయేందుకు కారణమైన ఆ విల్లా యజమానులైన ఆరవై ఏళ్ల దంపతులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. 

Updated Date - 2022-07-26T00:35:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising