ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చాణక్యనీతి: వీటిని విశ్వసిస్తే ఎప్పటికైనా ముప్పు తప్పదు!

ABN, First Publish Date - 2022-05-30T11:41:10+05:30

ఆచార్య చాణక్య నైపుణ్యం కలిగిన రాజకీయవేత్త...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆచార్య చాణక్య నైపుణ్యం కలిగిన రాజకీయవేత్త, దౌత్యవేత్త, ఆర్థికవేత్త. తాను రచించిన నీతి శాస్త్రంలో మనిషి జీవితానికి సంబంధించిన అనేక విషయాలను ప్రస్తావించారు. ఆచార్య చాణక్యుని విధానాలు నేటికీ అనుసరణీయం. ఒక వ్యక్తి ఏయే విషయాలను విశ్వసించకూడదో ఆచార్య చాణక్య తెలియజేశారు. అవేమిటో ఇప్పుడు చూద్దాం. 

ఆయుధాలు కలిగినవారు: 

ఆచార్య చాణక్య తెలిపిన వివరాల ప్రకారం ఆయుధాలు కలిగిన వారికి దూరంగా ఉండాలి. ఎందుకంటే అలాంటి వ్యక్తికి కోపం వచ్చినప్పుడు మీకు హాని కలిగించవచ్చు. అలాంటి వారితో స్నేహం చేయడం చావుతో సమానమని ఆచార్య చాణక్య తెలిపారు.


ప్రమాదకరమైన జంతువులు:

హింసాయుతమైన, ప్రమాదకరమైన జంతువులను ఎప్పుడూ నమ్మవద్దు. మీకు వాటిపై ఎంతటి ప్రేమ కలిగినప్పటికీ, వాటిని అస్సలు విశ్వసించకూడదు. అవి ఎప్పటికైనా మీకు హాని చేయవచ్చు. 

వేగంగా ప్రవహించే నది:

వేగంగా ప్రవహించే నది దగ్గరకి ఎప్పుడూ వెళ్లకూడదు. ఇది మీ మరణానికి కారణం కావచ్చు. ఆచార్య చాణక్యుడు తెలిపిన వివరాల ప్రకారం వేగంగా ప్రవహించే నది సమీపానికి ఎప్పుడూ వెళ్లకూడదు. అటువంటి సందర్భంలో మీరు బలమైన నీటి ప్రవాహంలో కొట్టుకుపోవచ్చు.

ఉన్నతస్థానంలో కూర్చున్న వ్యక్తులు: 

ఆచార్య చాణక్యుడు తెలిపిన వివరాల ప్రకారం ఉన్నత పదవుల్లో కూర్చున్న వ్యక్తులతో ఎప్పుడూ శత్రుత్వం కలిగి ఉండకూడదు. వీరు తమ శక్తియుక్తులను ఉపయోగించి మీకు హాని తలపెట్టే అవకాశం ఉంటుంది. 

Updated Date - 2022-05-30T11:41:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising