ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

SBI Bank: లావాదేవీలపై నిజంగానే షాకింగ్ నిర్ణయం తీసుకుందా?

ABN, First Publish Date - 2022-08-21T17:11:33+05:30

ఎస్‌బీఐ.. దేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు. ప్రస్తుతం SBI Bankకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లావాదేవీల నిబంధనల్లో బ్యాంకు సంచలనాత్మక మార్పులు చేసిందనీ.. ట్రాన్సాక్షన్స్‌పై పరిమితులు విధించిదనేది ఆ వార్త సా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: ఎస్‌బీఐ.. దేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు. ప్రస్తుతం SBI Bankకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లావాదేవీల నిబంధనల్లో బ్యాంకు సంచలనాత్మక మార్పులు చేసిందనీ.. ట్రాన్సాక్షన్స్‌పై పరిమితులు విధించిదనేది ఆ వార్త సారంశం. ఈ నేపథ్యంలో నిజంగా బ్యాంకు ఈ నిర్ణయం తీసుకుందా? అసలు ఈ వార్తలో నిజమెంత అనే పూర్తి వివరాల్లోకి వెళితే..


‘SBI బ్యాంకు కస్టమర్ల జేబులు గుల్ల అయ్యేలా సంచలన నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం.. ఇకపై ఎస్‌బీఐ అకౌంట్(SBI Account) కలిగిన వ్యక్తి.. ఏడాదిలో కేవలం 40 ట్రాన్సాక్షన్స్ మాత్రమే ఉచితంగా చేసుకోవచ్చు. అంతకు మించి లావాదేవీలు(Transaction in SBI) జరిపితే.. ప్రతి ట్రాన్సాక్షన్‌కు రూ.57.5 ఛార్జ్ చేస్తుంది. ఈ మొత్తం అకౌంట్లోంచి కట్ అయిపోతుంది. అంతేకాదు..  ఏటీఎం(ATM) నుంచి నెలకు నాలుగు కన్నా ఎక్కువ సార్లు డబ్బులు విత్‌డ్రా చేసకుంటే రూ. 173 కట్ అవుతుంది’ అంటూ బ్యాంకుకు సంబంధించిన వార్త నెటింట్లో చక్కర్లు కొడుతోంది. దీంతో కొంత మంది ప్రజలు కంగారపడుతున్నారు. 



ఈ నేపథ్యంలో ప్రభుత్వరంగానికి చెందిన ఫ్యాక్ట్ చెక్ ఆర్గనైజేషన్ పీఐబీ(PIB Fact Check) స్పందించింది. Fact Check చేసి SBI Bankకు సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త అసత్యమని కొట్టిపారేసింది. అందులో ఎంత మాత్రం వాస్తవం లేదని స్పష్టం చేసింది. బ్యాంకు ఏటీఏం నుంచి నెలకు ఐదు సార్లు డెబిట్ కార్డు ద్వారా ఫ్రీగా నగదును విత్‌డ్రా(ATM withdrawals) చేసుకోవచ్చని తెలిపింది. 5సార్లకు మించి ట్రాన్సాక్షన్ జరిపితే.. రూ.21 ఛార్జ్ చేస్తుందని పేర్కొంది. 


Updated Date - 2022-08-21T17:11:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising