ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Same Sex Marriage: మహిళకు మరో మహిళతో వివాహం.. ఇక్కడ ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయం.. ఎందుకో తెలిస్తే..

ABN, First Publish Date - 2022-08-18T14:57:04+05:30

యువకుడిని మరో యువకుడు పెళ్లి చేసుకోవడం లేదా యువతితో యువతి వివాహం అనే వార్తలు ఒకప్పుడు విని నోరెళ్లబెట్టేవారు. కానీ ఇప్పుడు ఇదంతా కామన్ అయింది. ఇటువంటి వార్తలను అప్పడప్పుడు వార్తల్లో చూస్తూనే ఉన్నాం. అయితే ఇక్కడ ఆశ్చర్య

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: యువకుడిని మరో యువకుడు పెళ్లి చేసుకోవడం లేదా యువతితో యువతి వివాహం(Lesbian weddings) అనే వార్తలు ఒకప్పుడు విని నోరెళ్లబెట్టేవారు. కానీ ఇప్పుడు ఇదంతా కామన్ అయింది. ఇటువంటి వార్తలను అప్పడప్పుడు వార్తల్లో చూస్తూనే ఉన్నాం. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. కర్నాటక(Karnataka)లో మహిళను మరో మహిళ పెళ్లి చేసుకునే(woman-to-woman marriage) పద్దతి కొన్నేళ్లుగా కొనసాగుతోంది. ఒక రకంగా చెప్పాలంటే అది అక్కడి సంప్రదాయం. ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే.. వివాహం జరిగిన తర్వాత ఆ ఇద్దరు మహిళలు కలిసి ఉండరు. ఎవరి ఇంట్లోకి వాళ్లు వెళ్లిపోయి.. సాధారణ జీవితం గడుపుతారు. వినడానికి విడ్డూరంగా ఉన్నా.. ఇది నిజం. కాగా.. ఈ పెళ్లిళ్లకు సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలియాలంటే.. పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే.



కర్నాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో తరమక్కి(Taramakki) అనే మారు మూల గ్రామం ఉంది. ఈ గ్రామంలో హులస్కెరె హలక్కీ కమ్యూనిటీ(Hulaskere Halakki community)కి చెందిన ప్రజలు నివసిస్తారు. ఇక్కడే మహిళకు మరో మహిళతో వివాహం జరిపించే సంప్రదాయం కొన్నేళ్లుగా కొనసాగుతోంది. ముఖ్యంగా వర్షాకాంలోనే ఈ పెళ్లిళ్లు జరుగుతుంటాయి. పెద్ద మొత్తంలో గ్రామంలోని ఇతర మహిళలు ఈ పెళ్లి వేడుకను అంగరంగ వైభంగా జరిపిస్తారు. ఇలా ఇద్దరు మహిళలకు అక్కడ పెళ్లి జరిపించడానికి ఓ పెద్ద కారణమే ఉందని స్థానికులు చెబుతున్నారు. ఇలా ఇద్దరు మహిళలకు పెళ్లి చేయడం ద్వారా ఇంద్రదేవుడు వర్షాలు(same sex marriages for rains) బాగా కురిపిస్తాడని అక్కడి వాళ్ల నమ్మకం. అతివృష్టి, అనావృష్టి రాకుండా పంటలు బాగా పండేందుకు ఈ వివాహాలు దోహద పడతాయని బలంగా నమ్ముతున్నారు. వివాహం చేసుకున్న ఇద్దరు మహిళ.. వేడుక ముగిసిన తర్వాత ఎవరి ఇంటికి వాళ్లు వెళ్లిపోయి అందరిలాగే సాధారణ జీవితం గడుపుతారట. ఎప్పటిలాగే తాజాగా తరమక్కి గ్రామంలో ఇద్దరు మహిళలు వర్షాల కోసం పెళ్లి చేసుకోవడంతో.. ఈ విషయం బయటికొచ్చింది. 


Updated Date - 2022-08-18T14:57:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising