ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Love wins: భీకర యుద్ధంలోనూ హద్దులు చెరిపేసి ప్రేమను గెలిపించుకున్నారు

ABN, First Publish Date - 2022-08-05T18:06:16+05:30

ఆ ప్రేయసీ ప్రియుల ప్రేమకు హద్దులు లేవని నిరూపిస్తూ తమ ప్రేమను గెలిపించుకున్నారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రష్యా యువకుడు ఉక్రెయిన్ గాళ్‌ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకున్నాడు

ధర్మశాల: ఆ ప్రేయసీ ప్రియుల ప్రేమకు హద్దులు లేవని నిరూపిస్తూ తమ ప్రేమను గెలిపించుకున్నారు.(Love wins) రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య భీకర యుద్ధం సాగుతున్న సమయంలోనూ ఆయా దేశాలకు చెందిన ప్రేయసీ, ప్రియుడు పెళ్లితో ఏకమయ్యారు. రష్యా జాతీయుడైన(Russian man) సెర్గీ నోవికోవ్ తన ఉక్రేనియన్ స్నేహితురాలు(Ukrainian girlfriend) ఎలోనా బ్రమోకాను ప్రేమించాడు. రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం సాగుతున్న నేపథ్యంలో ఆ ప్రేమ జంట ధర్మశాలలో(Dharamsala) హిందూ సంప్రదాయ పద్ధతిలో(traditional Hindu ceremony) వివాహం చేసుకొని, ప్రేమకు హద్దులు లేవని నిరూపించారు. 


రెండు దేశాల మధ్య యుద్ధం సాగుతున్న సమయంలోనూ ప్రేమకు హద్దులు చెరిపేస్తూ తమ రెండు దేశాలు కాకుండా మరో ప్రదేశమైన ధర్మశాలలో వారిద్దరూ ఒక్కటై ప్రేమను(married each other) గెలిపించుకున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లోని( Himachal Pradesh) ధర్మశాలలో హిందువుల సంప్రదాయ పద్ధతిలో రష్యాకు చెందిన సెర్గీ నోవికోవ్(Sergei Novikov) తన ఉక్రేనియన్ స్నేహితురాలు ఎలోనా బ్రమోకాను(Elona Bramoka) ఆగస్టు 2వతేదీన వివాహం చేసుకున్నాడు.తమ రెండు దేశాల మధ్య జరుగుతున్న భీకరమైన యుద్ధం గురించి పట్టించుకోకుండా, తటస్థ మైదానంలో ఒకరినొకరు వివాహం చేసుకోవడం అందరినీ ఆకట్టుకుంది.


హిందూ సంప్రదాయ బద్ధంగా వధువు ఎలోనా బ్రమోకా ఎర్ర, బంగారపు రంగు లెహంగా ధరించారు. వరుడు సెర్గీ నోవికోవ్ మెరూన్ రంగు కుర్తా పైజామా, నెహ్రూ జాకెట్ ధరించి పెళ్లి వేడుకలో పాల్గొన్నారు.హిందూ పురోహితుడు వేదమంత్రాలు పఠిస్తుండగా వధూవరులు సెర్గీ నోవికోవ్,ఎలోనా బ్రమోకాలు ఏడు అడుగులు వేశారు. స్థానికులు సైతం ఈ వివాహానికి హాజరై నూతన విదేశీ వధూవరులను ఆశీర్వదించారు.ఈ వధూవరుల వీడియో సోషల్ మీడియాలో పెట్టడంతో నెటిజన్లు తమ ప్రేమను గెలిపించుకున్న(Love wins) కొత్త దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.  




Updated Date - 2022-08-05T18:06:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising