ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మూతపడిన మాస్కో స్టాక్ మార్కెట్

ABN, First Publish Date - 2022-02-24T18:09:12+05:30

రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం నేపధ్యంలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం నేపధ్యంలో మాస్కో స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ నిలిచిపోయింది. పెట్టుబడిదారుల ట్రేడింగ్‌పై నిషేధం విధించారు. ఉక్రెయిన్‌పై  రష్యా సైనిక చర్య ప్రభావం భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్‌లో కనిపిస్తోంది. ఈ దిగజారుతున్న పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని రష్యాలోని మాస్కో ఎక్స్ఛేంజ్ అన్ని కార్యకలాపాలను నిలిపివేసింది.  తదుపరి ఆదేశాలు వెలువడే వరకు రష్యన్ స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ ఉండదు. షేర్లు కొనలేరు, అమ్మలేరు. అదే సమయంలో, స్టాక్ మార్కెట్‌లో ఇతర రకాల ట్రేడింగ్ కార్యకలాపాలు అంటే.. మ్యూచువల్ ఫండ్‌లు మొదలైనవి కూడా నిషేధించారు.


 రష్యన్ స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ నిలిపివేయడానికి అతిపెద్ద కారణం భారీ అస్థిరత. ఏదైనా దేశపు స్టాక్ మార్కెట్.. వ్యాపారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంటుంది. రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం కారణంగా మాస్కో స్టాక్ మార్కెట్ ఘోరంగా క్రాష్ అవుతుందని భావించారు. ఈ పరిస్థితిని అర్థం చేసుకుని వ్యాపారాన్ని నిలిపివేశారు. రష్యా- ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా, మాస్కో స్టాక్ మార్కెట్లో పెట్టుబడిదారులు భారీ నష్టాలను చవిచూశారు. పెట్టుబడిదారుల మూలధనం మునిగిపోయింది. ఉక్రెయిన్-రష్యా మధ్య వివాదం భారతదేశ స్టాక్ మార్కెట్‌ను కూడా ప్రభావితం చేసింది. గత 6 ట్రేడింగ్ రోజులుగా మార్కెట్‌లో నిరంతర క్షీణత ఉంది. ఇదే సమయంలో గురువారం నాటి ట్రేడింగ్‌లో స్టాక్‌ మార్కెట్లు భారీగా కుప్పకూలాయి. ట్రేడింగ్ సమయంలో, సెన్సెక్స్. నిఫ్టీ రెండూ 3 శాతం వరకు పడిపోయాయి. దీంతో ఒక్క ట్రేడింగ్ రోజులోనే ఇన్వెస్టర్లు రూ.8 లక్షల కోట్లకు పైగా నష్టపోయారు.

Updated Date - 2022-02-24T18:09:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising