ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్షణంలో తల్లీకొడుకులను కాపాడిన ఆర్పీఎఫ్ సిబ్బంది.. అసలేం జరిగిందంటే..

ABN, First Publish Date - 2022-08-09T20:04:35+05:30

ఇటీవలి కాలంలో రైలు ఎక్కబోతూ పడిపోయిన ఘటనలు చాలానే చూస్తున్నాం. అన్ని రైల్వే స్టేషన్లలో సీసీ కెమెరాలు(CC Cameras)

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

West Bengal : ఇటీవలి కాలంలో రైలు ఎక్కబోతూ పడిపోయిన ఘటనలు చాలానే చూస్తున్నాం. అన్ని రైల్వే స్టేషన్లలో సీసీ కెమెరాలు(CC Cameras) పెట్టడంతో దీనికి సంబంధించిన వీడియోలు బాగా వెలుగు చూస్తున్నాయి. రైలు ఎక్కబోతూ పడిపోతే అక్కడే ఉన్న ఆర్పీఎఫ్ సిబ్బంది(RPF Police) రక్షించిన ఘటనలు కోకోల్లలు. 


తాజాగా.. పశ్చిమ బెంగాల్‌(West Bengal)లోని బంకురా స్టేషన్‌(Bankura Station)కు తల్లీకొడుకులు రైలు ఎక్కడానికి వచ్చారు. వారు స్టేషన్‌లోకి అడుగు పెట్టే సమయానికి రైలు కదులుతోంది. తన తల్లిని ఎలాగైనా ట్రైన్ ఎక్కించి తను కూడా ఎక్కాలని కొడుకు ప్రయత్నించాడు. కానీ కాస్త పెద్ద వయసు కావడంతో ఆమె ఎక్కలేక జారి పడిపోయింది. ఆమెను ఎక్కించేందుకు ప్రయత్నించినా కొడుకు కూడా స్లిప్ అయి పడిపోయాడు. 


ఒక్క క్షణం లేటయినా వారిద్దరూ రైలు చక్రాల కింద ఉండేవారే. పరిస్థితిని గమనించిన ఆర్పీఎఫ్ సిబ్బంది పరుగున వెళ్లి క్షణాల్లో వారిద్దరి ప్రాణాలను కాపాడారు. రైల్వే మంత్రిత్వ శాఖ(Ministry of Railways) ఈ వీడియోను ట్విట్టర్(Twitter)లో పోస్ట్ చేసింది. ప్రయాణికులు కదులుతున్న రైలులో ఎక్కడం కానీ.. దిగడం కానీ చేయవద్దని రైల్వే శాఖ అభ్యర్థించింది. 




Updated Date - 2022-08-09T20:04:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising