ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్పీఎఫ్ జవాను తెగువతో నిలిచిన ప్రాణం... ఐదు సెకెన్లు లేటయితే...

ABN, First Publish Date - 2022-07-17T15:03:49+05:30

రైలు ప్రమాదాలకు సంబంధించిన వీడియోలు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రైలు ప్రమాదాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ప్రయాణికులు పొరపాటున కూడా పట్టాలపైకి వెళ్లవద్దని తరచూ రైల్వేశాఖ సూచిస్తుంటుంది. అయినా కొందరు ప్లాట్‌ఫారమ్‌కు వెళ్లడానికి మెట్లకు బదులుగా ట్రాక్‌లను ఉపయోగిస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కోసారి ప్రమాదాల బారిన కూడా పడుతుంటారు. తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక ఆర్‌పిఎఫ్ జవాన్ ధైర్యంచేసి ట్రాక్‌పై పడిపోయిన వ్యక్తిని రక్షించడాన్ని ఈ వీడియోలో చూడవచ్చు. ప్లాట్‌ఫారమ్‌పై చాలా మంది ప్రయాణికులు ఉండటం వీడియోలో కనిపిస్తుంది. ఇంతలో ఒక వ్యక్తి అకస్మాత్తుగా ట్రాక్‌పై జారిపడిపోయాడు. 


ఒక ఆర్పీఎఫ్ జవాన్ దీనిని గమనించి అతన్ని రక్షించడానికి పరుగెత్తాడు. ఇంతలో వెనుక నుంచి మరో పోలీసు అక్కడికి పరిగెడుతాడు. అతను అక్కడికి చేరుకునేలోపు, ఆర్పీఎఫ్ జవాన్ ఆ వ్యక్తిని ట్రాక్ నుండి పైకి లాగాడు. ఇంతలో హైస్పీడ్ రైలు ఆ ట్రాక్ మీదుగా వెళుతుంది. అయిదు సెకన్లు ఆలస్యం అయినా ఆ వ్యక్తి ప్రాణాలు గాలిలో కలిసిపోయేవి. ఈ ఘటన బెంగళూరులోని కేఆర్ పురం రైల్వే స్టేషన్‌లో జరిగింది. ఈ షాకింగ్ వీడియోను రైల్వే మంత్రిత్వశాఖ ఒక అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేసింది. ఈ 28 సెకన్ల వీడియోను ఇప్పటివరకు 88 వేలకు పైగా వీక్షించగా, వేలాది మంది ఈ వీడియోను లైక్ చేశారు. 

Updated Date - 2022-07-17T15:03:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising