ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈ ఫొటోలోని చిన్నారి ఎవరో గుర్తు పట్టగలరా..? పుట్టిన రోజు సందర్భంగా పాత ఫొటోతో కుటుంబసభ్యుల ట్వీట్

ABN, First Publish Date - 2022-04-22T19:02:29+05:30

పై ఫొటోలో నవ్వుతూ కనిపిస్తున్న చిన్నారి ఎవరో గుర్తు పట్టారా?

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పై ఫొటోలో నవ్వుతూ కనిపిస్తున్న చిన్నారి ఎవరో గుర్తు పట్టారా? ఆమె ఎవరో కాదు.. బ్రిటన్ రాజ వంశానికి చెందిన క్వీన్ ఎలిజబెత్. ఆమె తాజాగా 96వ జన్మదినోత్సవం జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆమె చిన్నప్పటి ఫొటోను రాజ కుటుంబీకులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆమె రెండేళ్ల వయసులో ఉండగా 1928లో తీసిన ఫొటోను ప్రజలతో పంచుకున్నారు. చిరునవ్వు చిందిస్తూ రెండు చేతులు బుగ్గల కింద పెట్టుకుని ఉన్న రాణి బ్లాక్ అండ్ వైట్ ఫొటో ఆకట్టుకుంటోంది. 


`హ్యాపీ బర్త్ డే క్వీన్ ఎలిజబెత్. ఈ రోజు రాణి 96వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా ఆమెకు రెండేళ్లు ఉన్నప్పుడు తీసిన ఫొటోను పంచుకుంటున్నాం. ఎలిజబెత్ రాణి అవుతారని కలలో కూడా ఊహించలేదు. ఈ ఏడాది ఆమె బ్రిటన్ రాణిగా ప్లాటినమ్ జూబ్లీ జరుపుకుంటున్నార`ని పేర్కొన్నారు. 70 ఏళ్ల పాటు బ్రిటన్ సింహాసనాన్ని అధిష్టించిన రాణిగా క్వీన్ ఎలిజబెత్ చరిత్ర సృష్టించారు. బ్రిటన్ చరిత్రలో ఆ ఘనత ఇంతకు ముందు ఎవ్వరూ సాధించలేదు. 




Updated Date - 2022-04-22T19:02:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising