ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముదిరిపోతున్న దొంగల తెలివి.. వారు బంగారం చోరీ చేసి ఎక్కడ దాచేవారంటే..

ABN, First Publish Date - 2022-02-10T09:33:22+05:30

ఒక నగరంలో గత కొన్ని నెలలుగా ఇళ్లు, నగలు షాపుల్లో నుంచి బంగారం చోరీ కేసులు వరుసగా ముందుకొస్తున్న తరుణంలో పోలీసులు నిఘా ముమ్మరం చేశారు. వారికి అనుకోకుండా ఒక మఠా గురించి సమాచారం అందింది. దీంతో పోలీసులు ఆ ముఠాకు సంబంధించి ముగ్గురిని అరెస్టు చేశారు. వారిని విచారణ చేయగా.. బంగారం వారు దాచిన చోటు చూసి పోలీసులే షాకయ్యారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒక నగరంలో గత కొన్ని నెలలుగా ఇళ్లు, నగలు షాపుల్లో నుంచి బంగారం చోరీ కేసులు వరుసగా ముందుకొస్తున్న తరుణంలో పోలీసులు నిఘా ముమ్మరం చేశారు. వారికి అనుకోకుండా ఒక మఠా గురించి సమాచారం అందింది. దీంతో పోలీసులు ఆ ముఠాకు సంబంధించి ముగ్గురిని అరెస్టు చేశారు. వారిని విచారణ చేయగా.. బంగారం వారు దాచిన చోటు చూసి పోలీసులే షాకయ్యారు.


వివరాల్లోకి వెళితే.. ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని బాలోద్ జిల్లాలో గత కొన్ని నెలలుగా వరుస దొంగతనాలు జరుగుతున్నట్లు పోలీసులకు ఫిర్యాదలందుతున్నాయి. వీటిలో బంగారం, బైక్ దొంగతనాలే ఎక్కువ. దీంతో పోలీసుల ప్రత్యేక బృందం దొంగలని పట్టుకోవడానికి నిఘా పెట్టింది. ఈ క్రమంలో పోలీసులకు ఒక షాపులో జరిగిన దొంగతనం కేసులో ఒక ముఠా గురించి కీలక సమాచారం అందింది.


ఈ చోరీలో అరుణ్ సాహు అనే పాత నేరస్తుడు చేశాడని తెలిసింది. అయితే పోలీసుల సాహుని పట్టుకోకుండా అతడిపై నిఘా పెట్టారు. ఆ తరువాత సమీపంలోని భాటాగావ్ అనే గ్రామంలో పట్టపగటలు ఒక ఇంట్లో దొంగలు చొరబడి బంగారు నగలు దోపిడీ చేశారని తెలిసింది. దీంతో పోలీసులు అరుణ్ సాహుని అరెస్టు చేసి విచారణ చేశారు. అతడు చెప్పిన సమాచారం మేరకు దొంగలకు సంబంధించిన ఒక స్థావరంలో పోలీసుల దాడి చేసి మరో ఇద్దరిని పట్టుకున్నారు. దీంతోపాటు రూ.10 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. మిగతా బంగారం వారు బ్యాంకులో తాకట్టు పెట్టి లోన్ రూపంలో డబ్బు తీసుకున్నారని తెలిసింది.


దొంగతనం చేసిన బంగారం బ్యాంకులో తాకట్టు పెట్టడం.. ఆ ముఠా నాయకుడు చూసుకుంటాడని.. అతని గురించి పూర్తి వివరాలు తమకు తెలియవని పట్టుబడిన వారు చెప్పారు. ఈ ముఠా మాస్టర్ మైండ్‌ కోసం పోలీసులు ఇంకా గాలిస్తున్నారు. బ్యాంకులో తాకట్టుపెట్టిన బంగారం విడిపించడానికి పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు. పట్టుబడిన దొంగలను కోర్టులో హాజరుపరచగా.. వారిని కోర్టు రిమాండ్‌కు పంపాలని ఆదేశించింది.




Updated Date - 2022-02-10T09:33:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising