ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వీళ్లు మామూలు మహిళలు కాదు.. పెళ్లి పేరుతో వీరు చేసే మోసం గురించి తెలిస్తే షాక్!

ABN, First Publish Date - 2022-01-08T15:22:42+05:30

ఆ ముగ్గురు మహిళలు ఒక గ్యాంగ్.. ఆ ముగ్గురిలో ఒకరు వధువు కాగా, మరొకరు ఆమె తల్లి, ఇంకొకరు ఆమె అక్క.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆ ముగ్గురు మహిళలు ఒక గ్యాంగ్.. ఆ ముగ్గురిలో ఒకరు వధువు కాగా, మరొకరు ఆమె తల్లి, ఇంకొకరు ఆమె అక్క. మధ్యవర్తుల ద్వారా పెళ్లి సంబంధం కుదుర్చుకుని వివాహానికి సిద్ధమవుతారు. పెళ్లి తంతు ముగిశాక ముగ్గురూ వరుడి ఇంటికి వెళతారు. అక్కడ మూడ్రోజులు ఉండి.. ఆ తర్వాత ఇంట్లో ఉన్న డబ్బు, నగలు తీసుకుని అదృశ్యమవుతారు. ఇప్పటికే ఎన్నోసార్లు ఇలాంటి మోసాలు చేసిన ఆ గ్యాంగ్‌ను తాజాగా పోలీసులు పట్టుకున్నారు. మధ్యప్రదేశ్‌లోని కొత్వాలి ప్రాంతంలో వీరు పోలీసులకు దొరికారు. 


దేవస్ ప్రాంతానికి చెందిన రాధిక, మంజు, పూజ అనే మహిళలు కొంతకాలంగా పెళ్లి పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. వికలాంగులు, వయసు మళ్లిన వారిని టార్గెట్ చేసి మధ్యవర్తుల ద్వారా వారిని సంప్రదిస్తారు. పెళ్లి కుదుర్చుకుంటారు. రాధికను వధువుగా పరిచేయం చేస్తారు. రాధికకు తల్లిగా మంజు, అక్కగా పూజ పరిచయమవుతారు. పెళ్లి తంతు అంతా పూర్తయ్యాక ముగ్గురూ వరుడి ఇంటికి వెళతారు. మూడ్రోజులు అక్కడ ఉండి అన్నీ గమనిస్తారు. అనంతరం ఇంట్లో ఉన్న డబ్బు, నగలు పట్టుకుని ఇంటి నుంచి పారిపోతారు. 


ఇటీవల రవి అనే వ్యక్తిని ఇలాగే మోసం చేయడంతో అతను పోలీసులను ఆశ్రయించాడు. రవి చెప్పిన సమాచారం ప్రకారం విచారణ చేసిన అధికారులు రాధికను అరెస్ట్ చేశారు. ఆమె ద్వారా మిగతా ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే ఈ గ్యాంగ్ ఇలా చాలా మోసాలకు పాల్పడినట్టు పోలీసుల విచారణలో తేలింది. ఆ ముగ్గురూ వివాహితలని, ముగ్గురి భర్తలూ జైళ్లో ఉండడంతో ఈ మహిళలు ఇలా మోసాలకు పాల్పడుతున్నారని పోలీసులు చెప్పారు. 

Updated Date - 2022-01-08T15:22:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising