ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: అనుకోకుండా ఎంట్రీ ఇచ్చిన అతిథి.. వీధి ఖాళీ చేసి మరీ దారిచ్చిన జనం!

ABN, First Publish Date - 2022-08-06T20:53:37+05:30

తిథి, వార, నక్షత్రాలు లేకుండా ఇంటికి వచ్చే వారినే అతిథి అంటాం. ఇది అందరికీ తెలిసిందే. అయితే.. ప్రస్తుతం ఓ అతిథికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఐఎఫ్ఎస్ అధికారి సుసాంత నంద(Susanta Nanda) పోస్ట్ చేసిన ఆ వీడియోను చూసి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: తిథి, వార, నక్షత్రాలు లేకుండా ఇంటికి వచ్చే వారినే అతిథి అంటాం. ఇది అందరికీ తెలిసిందే. అయితే.. ప్రస్తుతం ఓ అతిథికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఐఎఫ్ఎస్ అధికారి సుసాంత నంద(Susanta Nanda) పోస్ట్ చేసిన ఆ  వీడియోను చూసి కొందరు నెటిజన్లు షాకవుతుండగా.. అస్సాంలోని కొన్ని ప్రాంతాల ప్రజలకు ఇలాంటి సర్‌ప్రైజ్‌లు కామనే అంటున్నారు. ఇంతకూ IFS అధికారి పోస్ట్ చేసిన వీడియోలో ఏముంది.. నెటిజన్లు అలా ఎందుకు రియాక్ట్ అవుతన్నారనే పూర్తి వివరాల్లోకి వెళితే..





సాధారణంగా అడవుల్లో లేదా కేవలం జూ పార్కుల్లో మాత్రమే కనిపించే ఖడ్గమృగం( Rhino).. అకస్మాత్తుగా జనావాసాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. తారు రోడ్డుపై పరుగులు తీసింది. దాని రాకను గమనించిన ప్రజలు.. రోడ్డుపై నుంచి పరుగులు తీసి మరీ దానికి దారిచ్చారు. ఈ దృశ్యాలను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో(Social Media) పోస్ట్ చేశారు. అదికాస్తా ఐఎఫ్ఎస్ అధికారి కంట పడింది. దీంతో మనుషులు స్వార్థంతో జంతువుల అవాసాలైన అడవుల(Forest)ను ధ్వంసం చేస్తున్నారనే అర్థం వచ్చేలా.. ‘ఖడ్గమృగాలు నివసించే అడవుల్లో మానవ నివాసాలు ఏర్పడుతున్నప్పుడు.. అవి పట్టణాల్లో పరుగులు తీయడంలో ఆశ్చర్యం ఏముంది’ అంటూ వీడియోను పోస్ట్ చేశారు. దీంతో అదికాస్తా వైరల్‌(Viral)గా మారింది. ఈ క్రమంలో నెటిజన్లు స్పందిస్తూ.. ‘అడవి పరిసర ప్రాంతాల్లో నివాసాలు ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వాలు ఎందుకు అనుమతిస్తున్నాయి’ అని ప్రశ్నిస్తూ కొందరు కామెంట్ పెడితే.. మరికొందరేమో..అస్సాంలోని కొన్ని ప్రాంతాల ప్రజలకు ఇలాంటి సర్‌ప్రైజ్‌లు కామనే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 


Updated Date - 2022-08-06T20:53:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising