ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Reunion after 75 years:అపూర్వ కలయిక...75 ఏళ్ల తర్వాత మేనల్లుడిని కలిసిన మేనమామ

ABN, First Publish Date - 2022-08-09T16:28:53+05:30

1947వ సంవత్సరంలో పాకిస్థాన్ విభజన (pakistan Partition) సమయంలో జరిగిన అల్లర్లలో తప్పిపోయి పాకిస్థాన్ దేశానికి చేరిన ఓ యువకుడు ఏడున్నర దశాబ్దాల(Reunion after seventy five years) తర్వాత...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చండీఘడ్ (పంజాబ్): 1947వ సంవత్సరంలో పాకిస్థాన్ విభజన (pakistan Partition) సమయంలో జరిగిన అల్లర్లలో తప్పిపోయి పాకిస్థాన్ దేశానికి చేరిన ఓ బాలుడు ఏడున్నర దశాబ్దాల(Reunion after seventy five years) తర్వాత తన మేనమామను కలిసిన అపూర్వ ఘటన తాజాగా వెలుగుచూసింది1947వ సంవత్సరంలో జరిగిన దేశ విభజన అల్లర్ల సమయంలో ఆరేళ్ల వయసులో ఉండగా మోహన్ సింగ్ తన కుటుంబం నుంచి తప్పిపోయాడు.మోహన్ సింగ్ కుటుంబంలోని 22 మంది సభ్యులు పాకిస్థాన్‌లోని వారి స్వగ్రామమైన చక్ 37లో జరిగిన మత హింసలో ప్రాణాలు కోల్పోయారు.అల్లరిమూకలు పురుషులను చంపగా, ఇంట్లోని స్త్రీలు తమ పరువు కాపాడుకోవడానికి పిల్లలతో కలిసి బావిలో దూకారు.ఆరేళ్ల బాలుడైన మోహన్ తప్పించుకోగలిగాడు.


మోహన్ సింగ్ మేనమామ అయిన సర్వన్ సింగ్  తన కుమార్తె రచ్‌పాల్ కౌర్‌తో కలిసి విభజన సమయంలో పాక్ నుంచి భారతదేశంలోని జలంధర్(Jalandhar man) జిల్లాలోని బహౌదీన్‌పూర్ గ్రామానికి వలస వచ్చి స్థిరపడ్డారు. మోహన్ సింగ్ పాకిస్థాన్‌ దేశంలోని ఒక ముస్లిం కుటుంబంలో పెరిగాడు.అఫ్జల్ ఖలీక్ గా పేరు మార్చుకున్నాడు.పాకిస్థాన్ దేశంలో తప్పిపోయిన మేనల్లుడు(nephew) మోహన్ సింగ్ గురించి మేనమామ సర్వన్ సింగ్ ఆచూకీ తీయగా మేనల్లుడి ఫోన్ నంబరు లభించింది. మేనల్లుడు మోహన్ తో ఫోన్ లో మాట్లాడిన సర్వన్ సింగ్ 75 ఏళ్ల తర్వాత పాకిస్థాన్‌లోని కర్తార్‌పూర్‌లోని గురుద్వారా దర్బార్ సాహిబ్‌లో కలిశారు(Reunion).


 92 ఏళ్ల జలంధర్ మేనమామ సర్వన్ సింగ్ విభజన అల్లర్లలో(communal violence) కోల్పోయిన తన మేనల్లుడిని కలుసుకున్నప్పుడు భావోద్వేగానికి(emotional) గురయ్యాడు. పాక్ దేశానికి చెందిన మోహన్ సింగ్ అలియాస్ అప్జల్ ఖలీక్ తన మేనమామ సర్వన్  కోసం ఇంట్లో తయారు చేసిన మిఠాయిలు(sweets) తీసుకువచ్చాడు.75 ఏళ్ల తర్వాత కలుసుకున్న వీరిద్దరూ తమ ఆనందాన్ని చెప్పుకోవడానికి మాటలు చాలలేదు. వారు కౌగిలించుకున్నప్పుడు వారి కళ్లు చెమ్మగిల్లాయి.‘‘నా మేనల్లుడు దొరికాడని నేను నమ్మలేకపోతున్నాను. నా మేనల్లుడిని కలవడానికి దేవుడు నాకు దీర్ఘాయువును అనుగ్రహించాడు...రెండు దేశాల ప్రభుత్వాలు అనుమతిస్తే నా మేనల్లుడు భారతదేశానికి రావాలని నేను కోరుకుంటున్నాను’’ అని సర్వన్ సింగ్ కన్నీళ్లతో చెప్పారు.


Updated Date - 2022-08-09T16:28:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising