ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral News: నేరం చేయకుండానే జైలుకు.. క్యూ కడుతున్న జనం.. కారణమేంటంటే..

ABN, First Publish Date - 2022-09-04T00:44:50+05:30

జైలు అనే మాట వింటేనే అందరూ భయపడతారు.. అలాంటిది, జైలు తిండి తినాలని ఎవరు కోరుకుంటారు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జైలు అనే మాట వింటేనే అందరూ భయపడతారు.. అలాంటిది, జైలు తిండి తినాలని ఎవరు కోరుకుంటారు.. అయితే జార్ఖండ్‌ (Jharkhand)లోని జంషెడ్‌పూర్‌లో మాత్రం జైలు తిండి కోసం ఎగబడుతున్నారు.. తమ వంతు వచ్చే వరకు క్యూలో నిలబడుతున్నారు. ఎందుకని ఆశ్చర్యపోతున్నారా? దాని వెనుక ఓ కథ ఉంది. అదేంటంటే.. జంషెడ్‌పూర్‌లో కొన్ని రోజుల కిందట జైలు థీమ్‌తో ఓ రెస్టారెంట్‌ను ప్రారంభించారు. పూర్తిగా జైలు వాతావరణాన్ని ప్రతిబింబించే ఆ రెస్టారెంట్‌లో నోరూరించే వంటకాలను ఆరగించేందుకు జంషెడ్‌పూర్‌ వాసులు ఆసక్తి చూపుతున్నారు. 


ఇది కూడా చదవండి..

ఏడవకండిరా.. అంటూ పిల్లలను ఓదారుస్తూనే కన్నీటిపర్యంతమైన ఉపాధ్యాయుడు.. గుండెను తడిచేసే సంఘటన..!


జంషెడ్‌పూర్‌లోని ఆ రెస్టారెంట్ పేరు `ఖైదీ కిచెన్` (Kaidi Kitchen). ఆ రెస్టారెంట్ లోపలికి వెళితే నిజంగా జైలుకు వెళ్లినట్టే ఉంటుందట. అక్కడ భోజనం చేస్తుంటే జైలులో భోజనం చేస్తున్నట్టు ప్రత్యేక అనుభూతి కలిగేలా ఏర్పాట్లు చేశారు. జైలు గది వంటి డైనింగ్ ఏరియాలు, ఖైదీల దుస్తులు ధరించిన వెయిటర్లు ఉంటారు. అలాగే సంకెళ్లు పట్టుకుని తిరిగే నకిలీ జైలర్ కూడా కనిపిస్తాడు. ఈ రెస్టారెంట్‌లో భోజనం చేసేందుకు చాలా మంది ఎగబడుతున్నారు. ఈ రెస్టారెంట్‌పై సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది. ఈ ఆలోచనను కొంత మంది మెచ్చుకుంటే, మరికొంత మంది విమర్శిస్తున్నారు. 



Updated Date - 2022-09-04T00:44:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising