ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అది అర్థరాత్రి... ‘అమ్మానాన్న ఇంట్లో లేరు. నువ్వొచ్చి గిఫ్టు తీసుకెళ్లు’ అంటూ యువతి నుంచి ఫోన్... తరువాత ఏం జరిగిందంటే...

ABN, First Publish Date - 2022-12-10T12:07:29+05:30

ఉత్తరప్రదేశ్‌లోని బాందాలో ఒక ప్రేమికుడిని యువతి కుటుంబ సభ్యులు దొంగగా భావించి చితకబాదారు. స్పృహ తప్పి రక్తమోడుతున్న ఆ యువకుడిని స్థానికులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉత్తరప్రదేశ్‌లోని బాందాలో ఒక ప్రేమికుడిని యువతి కుటుంబ సభ్యులు దొంగగా భావించి చితకబాదారు. స్పృహ తప్పి రక్తమోడుతున్న ఆ యువకుడిని స్థానికులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడి వైద్యులు ఆ యువకునికి మెరుగైన వైద్యం అందించేందుకు కేంద్ర ఆసుపత్రికి తరలించారు. ఈ ఉదంతం బిసండా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ సందర్భంగా గాయపడిన ప్రేమికుడు మాట్లాడుతూ తాను డీజే వాయించే పనిని చేస్తుంటానన్నాడు. రాత్రి డిజే ప్లే చేశాక ఇంటికి తిరిగి వస్తుండగా, ప్రియురాలు ఫోను చేసి తన ఇంటికి రమ్మని ఆహ్వానించిందన్నాడు.

ఇంటిలో తల్లితండ్రి లేరని తెలిపిందన్నాడు. నువ్వు ఇంటికి వచ్చి నేనిచ్చే గిఫ్ట్ తీసుకోవాలని కోరిందని తెలిపాడు. ఈ మాట విన్నాక తాను ఆమె ఇంటికి వెళ్లానన్నాడు. ఇంటిలోకి వెళ్లగానే ఆ యువతి తండ్రి, సోదరులు తనను చూసి, దొంగగా భావించి తనపై దాడి చేశారని తెలిపాడు. తాను బాధతో కేకలు వేయడంతో చుట్టుపక్కలవారు అక్కడికి చేరుకుని, విషయమంతా తెలుసుకుని తనను వారి నుంచి విడిపించారని వివరించాడు. ఆ తరువాత తనను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారన్నాడు. వైద్యులు మాట్లాడుతూ బాధిత యువకుడు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడని, ప్రస్తుతం మెరుగైన చికిత్స అందిస్తున్నామని తెలిపారు.

Updated Date - 2022-12-10T12:07:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising