ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విడాకులు తీసుకున్న మహిళపై వల.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ట్రాప్.. చివరకు..

ABN, First Publish Date - 2022-03-18T22:51:40+05:30

ఆమె రెవెన్యూ శాఖలో ఉద్యోగిణి.. ఇటీవలె భర్త నుంచి విడాకులు తీసుకుంది..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆమె రెవెన్యూ శాఖలో ఉద్యోగిణి.. ఇటీవలె భర్త నుంచి విడాకులు తీసుకుంది.. ఒంటరిగా నివసిస్తున్న ఆమెను బంధువుల్లోనే ఓ వివాహితుడైన వ్యక్తి ట్రాప్ చేశాడు.. భార్యకు విడాకులు ఇచ్చి పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు.. ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు.. ఆమె జీతం డబ్బులను వాడుకున్నాడు.. ఆమె పేరు మీద అప్పులు చేశాడు.. చివరకు పెళ్లి చేసుకోమని అడిగితే తన నిజ స్వరూపం బయటపెట్టాడు.. దీంతో బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించింది. 


మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన 32 ఏళ్ల యువతి రెవెన్యూ శాఖలో పనిచేస్తోంది. ఏడాది క్రితం ఆమె భర్త నుంచి విడాకులు తీసుకుంది. అప్పట్నుంచి ఆమె ఒంటరిగా నివసిస్తోంది. ఆ సమయంలో ఆమెకు బంధువు అయిన అమన్ వర్మ అనే వ్యక్తి దగ్గరయ్యాడు. సానుభూతి చూపించి ఆమెను లొంగదీసుకున్నాడు. తన వైవాహిక జీవితం సంతృప్తిగా లేదని, భార్యకు విడాకులు ఇచ్చేస్తానని చెప్పి బాధిత మహిళతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. ఆమె నుంచి తరచుగా డబ్బులు తీసుకునేవాడు. 


అంతేకాదు ఆమె పేరు మీద బ్యాంకుల నుంచి లోన్లు తీసుకున్నాడు. తెలిసిన వారి దగ్గర అప్పులు చేశాడు. చివరకు ఆ మహిళ పెళ్లి గురించి అడిగితే తిరస్కరించాడు. భార్యకు, పిల్లలకు దూరం కాలేనని, ఇప్పటిలాగానే రహస్యంగా కలుద్దామని చెప్పాడు. దీంతో ఆ మహిళ తను మోసపోయినట్టు గ్రహించి పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

Updated Date - 2022-03-18T22:51:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising