ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Rats ate marijuana: 581 కేజీల గంజాయిని తినేసిన ఎలుకలు!

ABN, First Publish Date - 2022-11-24T19:40:14+05:30

ఈ ప్రపంచంలో వింతలకు కొదవలేదు. కొన్ని నమ్మశక్యం కాకుండా ఉంటాయి. మరికొన్నింటిని అతికష్టం మీద నమ్మొచ్చు. అయితే,

Rat
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్నో: ఈ ప్రపంచంలో వింతలకు కొదవలేదు. కొన్ని నమ్మశక్యం కాకుండా ఉంటాయి. మరికొన్నింటిని అతికష్టం మీద నమ్మొచ్చు. అయితే, ఇప్పుడు చెప్పేది మాత్రం ఏ రకంగానూ నమ్మశక్యం కాదు. అందుకనే కోర్టు కూడా ‘రుజువులు’ తెమ్మంది. ఇంతకీ ఆ నమ్మశక్యం కాని విషయమేంటంటారా! 581 కేజీల గంజాయిని ఎలుకలు తినేశాయి. అవునా! అని ఆశ్చర్యపోతున్నారు కదూ. మీరు నమ్మలేకున్నా ఇదే నిజం. ఈ విషయాన్ని పోలీసులే స్వయంగా కోర్టుకు చెప్పారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. షేర్‌గఢ్‌లోని గోదాములు, హైవే పోలీస్ స్టేషన్లలో నిల్వ చేసిన దాదాపు 581 కేజీల గంజాయి(marijuana)ని ఎలుకలు గుటకాయ స్వాహా చేశాయని ఉత్తరప్రదేశ్‌లోని మథుర పోలీసులు స్పెషల్ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్ (1985) కోర్టుకు చెబుతూ నివేదిక అందించారు. ఓ కేసులో స్వాధీనం చేసుకున్న గంజాయిని కోర్టులో సమర్పించాలని న్యాయస్థానం పోలీసులను ఆదేశించింది. స్పందనగా పోలీసులు ఈ నివేదికను కోర్టు ముందుంచారు.

పోలీసులు స్వాధీనం చేసుకున్న గంజాయిలో 386 కేజీలను షేర్‌గఢ్ పోలీస్ స్టేషన్‌లో భద్రపరచగా, దాదాపు 195 కేజీలను హైవే పోలీస్ స్టేషన్‌లో దాచిపెట్టారు. పోలీసుల నివేదిక చూసి విస్తుపోయిన అదనపు జిల్లా జడ్జి.. అయితే అందుకు తగిన సాక్ష్యాన్ని ఈ నెల 26వ తేదీలోగా సమర్పించాలని అధికారులను ఆదేశించారు. అయితే, హైవే పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ చోటె లాల్ కథనం మరోలా ఉంది. అక్టోబరులో కురిసిన భారీ వర్షాల కారణంగా గోదాములోకి నీళ్లు చేరి గంజాయి మొత్తం పాడైపోయిందని అన్నారు. షేర్‌గఢ్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ సోను కుమార్ కూడా ఇలాంటి కారణమే చెప్పడం కొసమెరుపు. ఇంతకీ.. ఆ ఎలుకలు తినేసిన గంజాయి విలువ ఎంతో తెలుసా.. అక్షరాలా అరవై లక్షల రూపాయలు.

Updated Date - 2022-11-24T19:47:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising