ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Transparent Fish: అలస్కాలో అరుదైన చేప.. దాని ప్రత్యేకత ఏంటంటే..

ABN, First Publish Date - 2022-07-04T01:22:36+05:30

సముద్రగర్భ శాస్త్రవేత్తలు అలస్కాలో అరుదైన చేపను గుర్తించారు. సముద్ర అంతర్బాగంలో పరిశోధనలు చేస్తుండగా ఈ అరుదైన చేప వారి కంట పడింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సముద్రగర్భ శాస్త్రవేత్తలు అలస్కాలో అరుదైన చేపను గుర్తించారు. సముద్ర అంతర్బాగంలో పరిశోధనలు చేస్తుండగా ఈ అరుదైన చేప వారి కంట పడింది. ఆ చేప ఫొటోను నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ శాస్త్రవేత్త సారా ఫ్రైడ్‌మాన్ ట్విటర్‌లో పోస్ట్ చేశారు. దాంతో ఆ చేప ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. పారదర్శక చేపల గురించి చాలా కాలంగా వింటున్నానని, వాటిని చూడాలనే తన కల నెరవేరినందుకు చాలా ఆనందంగా ఉందని సారా అన్నారు. ఆ చేపను Blotched snailfish అని పిలుస్తారని పేర్కొన్నారు.


ఇది కూడా చదవండి..

చిన్నారిని కాపాడిన Amazon delivery agent.. హీరో అంటూ ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు!


ఈ పారదర్శక చేప శరీరంపై మచ్చలను కలిగి ఉండి కొన్ని ప్రత్యేకమైన లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది పారదర్శకంగా ఉంటుంది కాబట్టి ఇతర జంతువులకు అంత సులభంగా చిక్కదు. దీనిని గుర్తించడం చాలా కష్టంగా ఉంటుందని శాస్త్రవేత్త చెప్పారు. ఇప్పటి వరకు నాలుగు నుంచి ఐదు చేపలను మాత్రమే తమ శాస్త్రవేత్తల బృందం గుర్తించినట్టు ఫ్రైడ్ మాన్ తెలిపారు. 


ఇవి సమద్రంలో 100 నుంచి 200 మీటర్ల లోతులో ఉంటాయన్నారు. అలాగే ఈ చేప శరీరం అడుగున్న కప్పుల వంటి నిర్మాణాలు ఉంటాయని, వాటి సహాయంతో అవి సముద్రం అడుగున్న ఉన్న రాళ్లకు బలంగా అతుక్కుని ఉంటాయని, ప్రవాహం వేగంగా ఉన్నప్పుడు వాటికి ఆ నిర్మాణాలు చాలా ఉపయోగపడతాయని చెప్పారు. 



Updated Date - 2022-07-04T01:22:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising