ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రామసేతుపై మరో వివాదం.. తెరపైకి ముస్లింల వాదన... వివరాలివే!

ABN, First Publish Date - 2022-10-06T14:44:40+05:30

మతపరమైన మనోభావాలను సినిమాలు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మతపరమైన మనోభావాలను సినిమాలు దెబ్బతీయడం కొత్తేమీ కాదు. ఇప్పుడు ఈ జాబితాలోకి ‘ఆది పురుష్’ సినిమా వచ్చిచేరింది. ఈ సినిమాలో చూపించిన కొన్ని సన్నివేశాలపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో రామసేతు ప్రస్తావన కనిపిస్తుంది. రామసేతు గురించి రకరకాల కథనాలు ప్రచారంలో ఉన్నాయి. హిందూ మత విశ్వాసాల ప్రకారం.. సీతామాతను రక్షించేందుకు రాముడు లంకకు వెళ్లేందుకు ఈ వంతెనను నిర్మించాడు. తమిళనాడులోని ధనుష్కోడి నుంచి శ్రీలంకకు అనుసంధానమవుతూ కనిపించే వంతెననే రామసేతు అని పిలుస్తారు. 



దీనిని నిర్మించే సమయంలో రాళ్లపై ’శ్రీరామ‘ అని రాశారని, అందుకే అవి మునిగిపోలేదని చెబుతారు. ముస్లిం మతంలో కూడా దీని గురించి పలు వాదనలు ఉన్నాయి. ముస్లిం మతానికి చెందిన కొందరు నిపుణులు ఈ వంతెనను ఆడమ్ నిర్మించాడని చెబుతారు. వారు తెలిపిన వివరాల ప్రకారం ఆడమ్ ఈ వంతెనను ఆడమ్ శిఖరాన్ని చేరుకోవడానికి ఉపయోగించాడు. శ్రీలంకకు అనుసంధానమయ్యేలా శ్రీరాముడు వంతెన నిర్మించాడని హిందూ పురాణాల్లో పేర్కొనడం నిజమేనని అమెరికన్ టీవీ షో ఆధారంగా డీడబ్ల్యు నివేదిక వెల్లడించింది. సైన్స్ ఛానెల్‌లోని "ఏన్షియంట్ లాండ్ బ్రిడ్జ్" షోలో పలువురు పరిశోధకులు భారతదేశం- శ్రీలంక మధ్య 50 కిలోమీటర్ల పొడవున రాళ్ళతో వంతెన నిర్మించారని, ఆ రాళ్ళు ఏడు వేల సంవత్సరాల పురాతనమైనవని పేర్కొన్నారు. భారతదేశంలోని పంబన్ ద్వీపం నుండి శ్రీలంకలోని మన్నార్ ద్వీపం వరకు విస్తరించి ఉన్న వంతెన మానవ నిర్మితమని పలు నివేదికలు తెలియజేస్తున్నాయి. నాసా ఉపగ్రహ చిత్రాలు కూడా రామసేతుపై స్పష్టత నిచ్చాయి. ఈ వంతెన 18,400 ఏళ్ల క్రితం నాటిదని అన్నా యూనివర్సిటీ, మద్రాస్ యూనివర్సిటీలు చేసిన పరిశోధనల్లో వెల్లడైంది. రామేశ్వరం ప్రాజెక్ట్‌లో జీఎస్‌ఐ చేసిన అధ్యయనంలో ఇది 7 వేల నుంచి 18 వేల సంవత్సరాల నాటిదని తేలింది. శాస్త్రవేత్తల పరిశోధనల్లో దాదాపు 48 కిలోమీటర్ల మేర ఈ వంతెన ఉందని వెల్లడయ్యింది. ఈ వంతెన 100 యోజనాల పొడవు ఉంటుందని కూడా చెబుతారు. అయితే  ధనుష్కోడి నుండి శ్రీలంక దూరం అంతగా లేనందున ఇది నిజం కాదనేవారూ ఉన్నారు. 

Updated Date - 2022-10-06T14:44:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising