ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వృద్ధుడయిన ‘రాముడు’... కన్నుమూసిన ‘రావణుడు’.. టీవీ రామాయాణం పాత్రధారులు ఇప్పుడు ఎలా ఉన్నారంటే...

ABN, First Publish Date - 2022-10-30T10:39:55+05:30

రామానంద్ సాగర్ రూపొందించిన టీవీ ధారావాహిక రామాయణంలో శ్రీరాముని పాత్రను అరుణ్ గోవిల్ పోషించారు. ఈ పాత్రలో ప్రేక్షకులు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రామానంద్ సాగర్ రూపొందించిన టీవీ ధారావాహిక రామాయణంలో శ్రీరాముని పాత్రను అరుణ్ గోవిల్ పోషించారు. ఈ పాత్రలో ప్రేక్షకులు అరుణ్ గోవిల్‌ను ఎంతగానో ఇష్టపడ్డారు. ఇప్పటికీ ఆయనను ప్రేక్షకులంతా రామునిగానే చూస్తున్నారు. ఈ సీరియల్ ప్రసారమై 35 ఏళ్లు గడిచినా ఇప్పటికీ అరుణ్ గోవిల్‌ను రామునిగానే భావిస్తూ పాదనమస్కారాలు చేస్తున్నారు. ఇక ఈ సీరియల్‌లో సీత పాత్ర పోషించిన దీపికా చిఖలియా ఇప్పుడు ఎక్కడకు వెళ్లినా ఆమను సీతామాతగా భావిస్తూ దండాలు పెడుతున్నారు.

ఇదే సీరియల్‌లో లక్ష్మణుని ప్రాత్ర పోషించిన సునీల్ లహరి ఆ తరువాత అనేక సీరియళ్లలో నటించారు. ఇప్పుడు ఆయన ఎవరూ గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. రామాయణంలో రావణుని పాత్ర పోషించిన అరవింద్ త్రివేది 2021లో ముంబైలో కన్నుమూశారు. ఇక భరతుని పాత్ర పోషించిన సంజయ్ జోగ్ 1995, నవంబరు 27న ముంబైలో కన్నుమూశారు.

రామాయణంలో శత్రుఘ్నుని పాత్ర పోషించిన సమీర్ రజ్దా ఆ తరువాత మహాభారత్ సీరియల్‌లోనూ నటించారు. ఇప్పటికీ గుజరాతీ సీనిమాలలో నటిస్తున్నారు. ఇక రామాయణంలో లవకుశులుగా నటించిన స్వప్నాలీ జోషి, మయూరేష్ క్షేత్రమండే ప్రస్తుతం గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. స్వప్నాలీ జోషీ నటునిగా రాణిస్తుండగా, మయూరేష్ ఒక పెద్ద కంపెనీకి సీఈఓగా వ్యవహరిస్తున్నారు.

Updated Date - 2022-10-30T11:10:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising