ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Pakistan టీనేజర్‌తో భారత మహిళ ప్రేమాయాణం.. 2ఏళ్ల కన్నబిడ్డను వదిలి దేశం దాటేందుకు ప్రయత్నం.. ఆటో డ్రైవర్ ట్విస్ట్‌తో..

ABN, First Publish Date - 2022-01-08T01:22:53+05:30

ఆమెకు కొన్నేళ్ల క్రితమే వివాహం జరిగింది. ఈ క్రమంలోనే రెండేళ్ల క్రితం బిడ్డకు కూడా జన్మనిచ్చింది. భర్త ఉద్యోగం చేస్తుంటే.. ఆమె ఇంట్లోనే ఖాళీగా ఉండేంది. కాలక్షేపం కోసం ఆన్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: ఆమెకు కొన్నేళ్ల క్రితమే వివాహం జరిగింది. ఈ క్రమంలోనే రెండేళ్ల క్రితం బిడ్డకు కూడా జన్మనిచ్చింది. భర్త ఉద్యోగం చేస్తుంటే.. ఆమె ఇంట్లోనే ఖాళీగా ఉండేంది. కాలక్షేపం కోసం ఆన్‌లైన్‌లో లూడో ఆడుతుండేంది. ఈ నేపథ్యంలోనే ఆర్నెళ్ల క్రితం పాకిస్థాన్‌కు చెందిన యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. తర్వాత ప్రియుడి దగ్గరకు వెళ్లేందుకు సిద్ధపడింది. అయితే ఆటో డ్రైవర్ ట్విస్ట్ ఇవ్వడంతో కథ అడ్డం తిరిగింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


రాజస్థాన్‌కు చెందిన మహిళకు కొన్ని ధోల్పూర్ ప్రాంతానికి చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. భర్తతో కలిసి ధోల్పూర్‌లోనే నివసిస్తున్న ఆమె రెండేళ్ల క్రితం బిడ్డకు జన్మనిచ్చింది. భర్త ఉద్యోగానికి వెళ్తుండగా.. ఇంట్లోనే ఖాళీగా ఉంటున్న సదరు మహిళ ఆన్‌లైన్‌లో ఆటలాడుతూ కాలక్షేపం చేసేది. ఈ క్రమంలోనే ఆరు నెలల క్రితం ఆమెకు పాకిస్థాన్ యువకుడితో పరిచయం ఏర్పడింది. అదికాస్తా ప్రేమగా మారింది. అతడిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధపడిన ఆమె.. పాకిస్థాన్‌కు వెళ్లేందుకు బుధవారం సాయంత్రం ఇంటి నుంచి బయల్దేరింది. 



ఈ క్రమంలోనే ఆమె అమృత్‌సర్ చేరుకుంది. ‘అట్టారి బార్డర్ వరకూ వస్తే అక్కడ నుంచి నేను తీసుకెళ్తాను’ అని ప్రియుడు సూచించడంతో అమృత్‌సర్‌లో ఆటో ఎక్కింది. ఆమె వ్యవహరశైలిపై అనుమానం వ్యక్తం చేసిన ఆటో డ్రైవర్.. పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి.. ఆమెను అదుపులోకి తీసుకున్నారు. మొదట కట్టుకథలు చెప్పిన ఆమె.. చివరికి నిజాన్ని బయటపెట్టింది. పాకిస్థాన్ వ్యకిని ప్రేమిస్తున్నట్టు పేర్కొంది. తనను వెళ్లనీయాలంటూ పోలీసులను అభ్యర్థించింది. అయితే పోలీసులు మాత్రం ఆమె విన్నపాన్ని పట్టించుకోలేదు. ధోల్పూర్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఆమెను ఇంటికి తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు అమృత్‌సర్ చేరుకున్నారు. 


Updated Date - 2022-01-08T01:22:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising