ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఎక్కడ చదువుకున్నారంటే...

ABN, First Publish Date - 2022-12-21T08:55:31+05:30

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్ర అందరినీ ఆకర్షిస్తోంది. ఈ ప‌ర్య‌ట‌న‌తో దేశంలో కాంగ్రెస్ ప‌రిస్థితిని మ‌ళ్లీ మెరుగుప‌ర‌చాల‌ని రాహుల్ ప్రయత్నిస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్ర అందరినీ ఆకర్షిస్తోంది. ఈ ప‌ర్య‌ట‌న‌తో దేశంలో కాంగ్రెస్ ప‌రిస్థితిని మ‌ళ్లీ మెరుగుప‌ర‌చాల‌ని రాహుల్ ప్రయత్నిస్తున్నారు. అయితే రాహుల్ గాంధీ, ఆయన సోదరి ప్రియాంకా గాంధీ ఏ పాఠశాలలో, ఏ కళాశాలలో చదువుకున్నారనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రాహుల్ గాంధీ తన ప్రారంభ విద్యను సెయింట్ కొలంబస్ పాఠశాలలో చదివారు. రాహుల్ ఇక్కడ ఎక్కువ కాలం చదవలేకపోయినా భద్రతా కారణాల దృష్ట్యా డెహ్రాడూన్‌లోని ప్రముఖ పాఠశాల 'ది డూన్ స్కూల్'లో చదువుకున్నారు. ఈ పాఠశాలలో 1981 నుండి 1983 వరకు విద్యను అభ్యసించారు. తరువాత రాహుల్ గాంధీ1989 సంవత్సరంలో ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో అడ్మిషన్ తీసుకున్నారు.

అయితే భద్రతా కారణాల దృష్ట్యా రాహుల్ గాంధీ... హోవార్డ్ యూనివర్సిటీకి వెళ్లాల్సి వచ్చింది. 1991లో తండ్రి రాజీవ్ గాంధీ హత్య అనంతరం రాహుల్‌ను ఫ్లోరిడాలోని రోలిన్స్ కాలేజీకి పంపించారు. ఈ కళాశాలలో రాహుల్ ఆర్ట్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అనంతరం కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలోని ట్రినిటీ కళాశాల నుండి ఎంఫిల్ పట్టా తీసుకున్నారు. ఇక రాహుల్ సోదరి ప్రియాంక గాంధీ ఎక్కడ చదువుకున్నారనే విషయానికి వస్తే... ఆమె ఢిల్లీలోని మోడరన్ స్కూల్లో తన ప్రాథమిక విద్యను అభ్యసించారు. దీని తరువాత ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని జీసస్ అండ్ మేరీ కాలేజీ నుండి సైకాలజీలో పట్టభద్రులయ్యారు. ఇక్కడ నుండి బౌద్ధ అధ్యయనాలలో మాస్టర్స్ డిగ్రీని తీసుకున్నారు.

Updated Date - 2022-12-21T09:03:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising