ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చాణక్యనీతి: మనిషిని పేదరికంలోకి నెట్టేసే అలవాట్లివే..

ABN, First Publish Date - 2022-07-04T11:56:22+05:30

ఆచార్య చాణక్యుడి నీతి శాస్త్రంలో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆచార్య చాణక్యుడి నీతి శాస్త్రంలో మానవ జీవితానికి సంబంధించిన అనేక విషయాల ప్రస్తావనవుంది. వీటిని అనుసరించడం ద్వారా జీవితంలో విజయం సాధించవచ్చు. ఆచార్య చాణక్యుడు తెలిపిన వివరాల ప్రకారం ఎవరికైనా ఈ  అలవాట్లు ఉంటే వారు పేదరికంలో కొట్టుమిట్టాడాల్సి వస్తుంది. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 

పరిశుభ్రత  

ఎవరైనా సరే తమ ఇంటి పరిశుభ్రత పట్ల పూర్తి శ్రద్ధ వహించాలి. లక్ష్మీదేవికి పరిశుభ్రత అంటే చాలా ఇష్టం. పరిశుభ్రత ఉన్న ఇంటిలో లక్ష్మీదేవి నివసిస్తుంది. కొందరి ఇంట్లో మురికి అధికంగా ఉంటుంది. ఇది దారిద్ర్యాన్ని తెచ్చిపెడుతుంది. అందుకే పరిశుభ్రతపై పూర్తి శ్రద్ధ వహించాలి.

ఆహారం 

కొంతమంది ఆకలి లేనప్పుడు కూడా అధికంగా ఆహారం తీసుకుంటారు. అవసరానికి మించి ఇలా తినడం వల్ల కూడా పేదరికం వస్తుంది. కాబట్టి మీ అవసరాన్ని బట్టి ఆహారం తీసుకోండి. ఎక్కువ ఆహారం తీసుకోవద్దు.


అతినిద్ర 

ఆచార్య చాణక్యుడు తెలిపిన వివరాల ప్రకారం అకాలనిద్ర, అతినిద్రకు మనిషి దూరంగా ఉండాలి. ఈ అలవాటు గల వారి ఇంటిలో నుంచి లక్ష్మీదేవి వెళ్లిపోతుంది. దీంతో వారు ఆర్థిక సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. అందుకే సూర్యోదయం, సూర్యాస్తమయం సమయంలో నిద్రకు దూరంగా ఉండాలి. దీనివల్ల డబ్బుకు సంబంధించిన సమస్యలు రావడమే కాకుండా ఆరోగ్యంపై కూడా చెడు ప్రభావం పడుతుంది.

అబద్ధం

చాలా మంది డబ్బు సంపాదనకు అబద్ధాలు చెబుతారు. నిజాయితీని కోల్పోతారు. ఆచార్య చాణక్యుడు తెలిపిన వివరాల ప్రకారం, అబద్ధాలు, నిజాయితీతో సంపాదించిన డబ్బు ఎక్కువ కాలం ఉండదు. అలాంటివారి ఇంట్లో లక్ష్మీదేవి ఎక్కువ కాలం నివాసం ఉండదు. అందుకే ఇలాంటి అలవాట్లను వదిలిపెట్టాలని చాణక్య తెలిపారు.  

Updated Date - 2022-07-04T11:56:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising