ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్కూల్‌కు ముఖ్య అతిథిగా వచ్చిన ఎమ్మెల్యేను పట్టించుకోని స్వీపర్‌.. కారణం ఏంటని ఆరా తీస్తే..

ABN, First Publish Date - 2022-04-07T17:52:06+05:30

అది పంజాబ్‌లోని బటిండా ప్రాంతంలోని ఒక ప్రభుత్వ పాఠశాల..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అది పంజాబ్‌లోని బటిండా ప్రాంతంలోని ఒక ప్రభుత్వ పాఠశాల.. ఆ బడికి ఎమ్మెల్యే వస్తుండడంతో పిల్లలు, టీచర్లు బిజీబిజీగా ఉన్నారు.. ముఖ్య అతిథి రాగానే అతనిని పూల మాలలతో సన్మానించారు.. అదే స్కూలు ఆవరణలో ఒకావిడ చీపురుతో చెత్తను ఊడుస్తోంది.. ఆమె ముఖ్య అతిథిని కనీసం కన్నెత్తి కూడా చూడలేదు, ఎలాంటి గౌరవం ప్రదర్శించలేదు.. ఎందుకంటే ఆ ఎమ్మెల్యే ఆమె కొడుకే మరి.


పంజాబ్‌లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బదౌర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మాజీ సీఎం చరణ్ జీత్ సింగ్ చన్నీని ఓడించిన ఆమ్‌ ఆద్మీ పార్టీ అభ్యర్థి లభ్‌ సింగ్‌ అతి సామాన్యుడు. అతడి తల్లి బల్‌దేవ్‌ కౌర్‌ గత ఇరవై ఐదేళ్లుగా స్కూల్లో స్వీపర్‌గా పనిచేస్తోంది. కొడుకు ఎమ్మెల్యే అయినా ఆమె తన పని మానుకోలేదు. కొడుకు కూడా తల్లిని ఉద్యోగం మానెయ్యాలని ఒత్తిడి చెయ్యలేదు. స్వీపర్‌గా పని చేస్తూనే లభ్ సింగ్‌ను బల్‌దేవ్ కౌర్ చదివించారు. బాగా చదువుకుని రాజకీయాల వైపు ఆకర్షితుడైన లభ్ సింగ్ పదేళ్ల క్రితం ఆప్‌లో చేరారు. 


ఉత్సాహంగా పని చేస్తూ మంచి గుర్తింపు సంపాదించుకుని ఏకంగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. కొడుకు ఎమ్మెల్యే అయినా తల్లి మాత్రం తన స్వీపర్‌ పనిని వదల్లేదు. ఇప్పటికీ ఈ కుటుంబం రెండు గదులున్న ఇంట్లోనే నివసిస్తోంది. ఎప్పుడో కొనుక్కున్న పాత మోటర్‌ సైకిల్‌నే లభ్‌సింగ్ వాడుతున్నారు. తల్లి స్వీపర్‌గా పనిచేస్తున్న పాఠశాలలో లభ్ సింగ్ చదువుకున్నారు. ఇప్పుడు అదే పాఠశాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.   

Updated Date - 2022-04-07T17:52:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising