ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kavitha Ramu: ఈ మహిళా ఐఏఎస్ వీడియో ఇంటర్నెట్‌లో ఎందుకింత వైరల్ అయిందంటే..

ABN, First Publish Date - 2022-07-30T22:06:01+05:30

తమిళనాడు రాజధాని చెన్నై నగర శివారు ప్రాంతమైన మహాబలిపురం (Mahabalipuram) వేదికగా 44వ చెస్ ఒలంపియాడ్ పోటీలు (Chess Olympiad 2022) ఈ నెల 28వ తేదీ నుంచి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నై నగర శివారు ప్రాంతమైన మహాబలిపురం (Mahabalipuram) వేదికగా 44వ చెస్ ఒలంపియాడ్ పోటీలు (Chess Olympiad 2022) ఈ నెల 28వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమ ప్రారంభోత్సవ వేడుక అతిరథ మహారథుల మధ్య అట్టహాసంగా జరిగింది. ఈ పోటీలకు విశేష ప్రచారం కల్పించేందుకు సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్‌తో (ar rahman) మ్యూజిక్ వీడియో చేయించారు. నగరంలోని నపియర్ వంతెనను ‘చెస్ బోర్డ్’ (Chess Board) మాదిరిగా పెయింటింగ్ చేసి ప్రచారం కల్పించారు. అయితే.. ఇలా ప్రభుత్వం తమకు తోచిన విధంగా ప్రచారం కల్పిస్తే తమిళనాడుకు చెందిన ఒక మహిళా కలెక్టర్ మాత్రం చాలా కొత్తగా ఆలోచించారు. మడిసన్నాక కూసంత కళాపోషణ ఉండాలని ఓ సినిమాలో చెప్పినట్టుగా ఆమె ఈ ‘చెస్ ఒలంపియాడ్’ సందర్భంగా తనకు తెలిసిన కళతో ఈ చదరంగపు పోటీలను సరికొత్తగా ప్రమోట్ చేశారు.



స్వతహాగా నాట్యకారిణి అయిన పుదుకొట్టై జిల్లా కలెక్టర్ (pudukkottai collector) కవితా రాము (Kavitha Ramu) ఈ ‘చెస్ ఒలంపియాడ్’ పోటీలకు ప్రచారం కల్పించేందుకు తమిళనాడు సంస్కృతిని ప్రతిబింబించేలా అక్కడి నృత్య రూపాలతో ఒక వీడియోకు కొరియోగ్రఫీ చేశారు. ‘చెస్ బోర్డ్’పై నృత్యకారులను పావులుగా నిలిపి తమిళనాడుకు చెందిన పలు నృత్యరూపాలనే ఎత్తుగడలుగా మలిచి ‘చదరంగం’ ఆడినట్టుగా నృత్యం చేయించారు. మూడు నిమిషాల 48 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో (Kavitha Ramu Video) తమిళనాడు జానపద నృత్య రూపాలైన ‘Therukkoothu’, ‘Poi-kaal kuthirai’, యుద్ధ విద్యలైన ‘మల్ల యుద్ధం’, సిలంబంతో పాటు క్లాసికల్ భరతనాట్యాన్ని కూడా కళాకారులతో ప్రదర్శింపజేశారు. పుదుకొట్టై కలెక్టర్ కవితా రాము కొరియోగ్రఫీ చేసిన ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ (viral) అయింది. నెటిజన్ల ప్రశంసలు అందుకుంది. ఈ వీడియో చూసిన ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర (anand mahindra) తన ట్విట్టర్‌లో వీడియోను పోస్ట్ చేశారు. చాలా అద్భుతంగా కవితా రాము కొరియోగ్రఫీ చేశారని ఆయన తన ట్వీట్‌లో కొనియాడారు. చదరంగం బోర్డుపై ఉండే పావులకు ప్రాణం ఉంటే ఇలానే ఉంటుందేమో అన్నట్టుగా వీడియోను అద్భుతంగా మలిచారని మహీంద్రా ట్వీట్‌లో (anand mahindra tweet) పేర్కొన్నారు.



ఈ వీడియో వైరల్ కావడంతో అసలు ఎవరీ కవితా రాము అని నెటిజన్లు గూగుల్‌లో (google) వెతుకులాట సాగిస్తున్నారు. పుదుకొట్టై జిల్లా కలెక్టర్ కవితా రాము మంచి క్లాసికల్ డ్యాన్సర్. 25 సంవత్సరాల్లో 700 వేదికలపై భరత నాట్య ప్రదర్శనలిచ్చారు. ఐఏఎస్ అధికారిగా ఎంత తీరిక లేకుండా గడుపుతున్నా అవకాశం దొరికినప్పుడల్లా ఆమె తన సమయాన్ని నృత్యానికి కేటాయించేవారు. ఆమె నాలుగేళ్ల వయసు నుంచే నాట్యంపై మక్కువ పెంచుకున్నారు. అంత చిన్న వయసులోనే నాట్యంలో శిక్షణ తీసుకున్నారు. ఆమె చిదంబరం వేదికగా జరిగిన ‘Fifth World Tamil Conference’ లో ఇచ్చిన నృత్య ప్రదర్శనకు విశేష ఆదరణ దక్కింది. ఐఏఎస్‌గా బాధ్యతలు తీసుకున్నప్పటికీ నృత్య కళను ఆమె పక్కన పెట్టలేదు. వృత్తిని, నాట్యంపై తనకున్న ఇష్టాన్ని రెండు కళ్లుగా భావించింది. ఐఏఎస్ అయిన తర్వాత కూడా ఆమె సమయం దొరికినప్పుడు చిన్నారులకు డ్యాన్స్ క్లాసులు చెప్పేవారు. లక్ష్యాన్ని నెరవేర్చుకునే క్రమంలో ఇష్టాలను వదిలేసుకోవాల్సిన అవసరం లేదని పుదుకొట్టై కలెక్టర్ కవితా రాము లైఫ్ జర్నీ నిరూపించింది.

Updated Date - 2022-07-30T22:06:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising