ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈ వీడియోల్లో ఉన్నట్లుగా మనమూ చేద్దాం.. అంటూ యువతికి అధ్యాపకుడి సందేశం.. అన్నీ చూసిన యువతి చివరికి ఓ రోజు...

ABN, First Publish Date - 2022-03-16T03:27:22+05:30

ప్రస్తుత సమాజంలో కళాశాలల్లో కూడా కామాంధులను చూడాల్సి వస్తోంది. విద్యాబుద్ధులు నేర్పించి.. ఉన్నతంగా తీర్చిదిద్దాల్సిన కొంతమంది ఉపాధ్యాయులు, అధ్యాపకులు.. విద్యార్థినులను వక్రదృష్టితో ..

ప్రతీకాత్మక చిత్రం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దురలవాట్లకు బానిసై జులాయిగా తిరిగేవారు.. చివరకు కామాంధులుగా మారి బాలికలు, యువతులపై దాడులు చేయడం ఎక్కువగా చూస్తుంటాం. కానీ ప్రస్తుత సమాజంలో కళాశాలల్లో కూడా కామాంధులను చూడాల్సి వస్తోంది. విద్యాబుద్ధులు నేర్పించి.. ఉన్నతంగా తీర్చిదిద్దాల్సిన కొంతమంది ఉపాధ్యాయులు, అధ్యాపకులు.. విద్యార్థినులను వక్రదృష్టితో చూస్తున్నారు. కొందరైతే చదువు పేరుతో బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ పైశాచిక ఆనందం పొందుతుంటారు. ఇంకొందరు దేవాలయంలా భావించే స్కూళ్లు, కళాశాలల్లోనే విద్యార్థినులపై అత్యాచారాలకు పాల్పడుతుంటారు. తమిళనాడులో ఇటీవల ఓ ప్రొఫెసర్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. విద్యార్థినిపై కన్నేసిన అతడు.. ‘‘ ఈ వీడియోల్లో ఉన్నట్లుగా మనమూ చేద్దాం’’.. అంటూ మెసేజ్ పెట్టాడు. వీడియోలు చూసి షాకైన యువతి ఓ రోజు ఏం చేసిందంటే..


తమిళనాడుకు చెందిన ఓ యువతి స్థానికంగా ఉన్న ఓ కళాశాలలో విద్యనభ్యసిస్తోంది. అందులోని వాసుదేవన్ అనే అధ్యాపకుడు ఈమెపై కన్నేశాడు. ఎలాగైనా యువతిని తన దారికి తెచ్చుకోవాలని రోజూ ఏదో వంక పెట్టి మాటలు కలిపేవాడు. అధ్యాపకుడు కావడంతో యువతి కూడా మాట్లాడుతూ ఉండేది. దీన్ని అవకాశంగా తీసుకున్న అతడు.. యువతి నంబర్‌ను తీసుకున్నాడు. మొదట్లో సాధారణ మెసేజ్‌లు పంపించే అతను.. క్రమక్రమంగా అశ్లీల మెసేజ్‌లు పంపేవాడు. అయినా యువతి భయంతో ఎవరికీ చెప్పేది కాదు. దీంతో ఆ అధ్యాపకుడు రోజరోజుకూ మరింత రెచ్చిపోయాడు. ఓ రోజు ఏకంగా అశ్లీల వీడియోలను పంపించాడు. ‘‘ఈ వీడియోల్లో చేసినట్లు మనమూ చేద్దాం’’ అంటూ మెసేజ్ పంపించాడు. వాటిని చూసిన యువతి ఒక్కసారిగా షాక్‌కు గురైంది. అప్పటికీ తన బాధను ఎవరికీ చెప్పుకోలేక లోలోపలే కుమిలిపోతూ ఉండేది.

‘‘ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నేనున్నా’’... అంటూ బాలికను నమ్మించి తీసుకెళ్లాడు.. చివరకు వైద్య పరీక్షల్లో తేలింది ఏంటంటే..


కొన్నాళ్లు పోతే పద్ధతి మార్చుకుంటాడులే అనుకుని సర్దుకుంది. కానీ ఆ అధ్యాపకుడు మాత్రం.. తన కోరిక తీర్చమంటూ రోజూ మరిన్ని వీడియోలను పంపడం మొదలెట్టాడు. చివరకు విసిగిపోయిన యువతి.. తన సమస్యను సోదరుడితో చెప్పుకొని బోరున విలపించింది. దీంతో యువతి సోదరుడు కళాశాలకు వెళ్లి అధ్యాపకుడిని నిలదీశాడు. అప్పటికే ఆగ్రహంతో ఉన్న అధ్యాపకుడు.. బాధితులపైనే దాడి చేయించాడు. చివరకు పోలీసులను ఆశ్రయించి అధ్యాపకుడిపై ఫిర్యాదు చేశారు. కళాశాలకు చెందిన విద్యార్థులంతా పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ధర్నా చేశారు. వెంటనే అధ్యాపకుడిని సస్పెండ్ చేయాలంటూ డిమాండ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.

పీఈటీ చేసిన నిర్వాకాన్ని తల్లిదండ్రులకు చెప్పలేకపోయింది.. ఇటీవల చెల్లెలికి కూడా అలాగే జరగడంతో.. చివరికి..

Updated Date - 2022-03-16T03:27:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising