ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

chanakya niti: ఈ తరహా సంపాదనతో వచ్చేది దరిద్రమే...

ABN, First Publish Date - 2022-10-02T12:19:52+05:30

ఆచార్య చాణక్యుడు ప్రపంచంలోని అత్యుత్తమ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆచార్య చాణక్యుడు ప్రపంచంలోని అత్యుత్తమ విద్వాంసులలో ఒకనిగా పేరొందారు. అతను తన చాణక్య నీతి ద్వారా అసంఖ్యాక యువతకు మార్గనిర్దేశం చేశారు. రాజకీయాలు, దౌత్యం, యుద్ధనీతిలో మంచి ప్రావీణ్యం ఉన్న ఆచార్య చాణక్యుడు జీవన విధానాలను రూపొందించారు. ఆచార్య చాణక్య విధానాలను చదివి, వాటిని అనుసరించే వ్యక్తి జీవితంలో ఎప్పుడూ ఓటమిని ఎదుర్కోడని కూడా చెబుతారు. అతను ఎప్పుడూ విజయాల మెట్లు ఎక్కుతూనే ఉంటాడంటారు. 


ఆచార్య చాణక్యుడు డబ్బుకు సంబంధించి అనేక విధానాలను కూడా రూపొందించాడు. ఈ విధానాలను అర్థం చేసుకున్న వారు ఏ విధమైన వైఫల్యాన్ని కూడా ఎదుర్కోరని చెబుతారు. చాణక్య నీతిలోని ఒక శ్లోకంలో లక్ష్మి చంచల స్వభావి అని పేర్కొన్నారు. ఎవరైనా దొంగతనం, జూదం, అన్యాయం, మోసం చేయడం ద్వారా డబ్బు సంపాదిస్తే, ఆ డబ్బు త్వరగా కనుమరుగవుతుంది. అందుకే ఎవరైనా అన్యాయం చేయడం లేదా అబద్ధం చెప్పడం ద్వారా డబ్బు సంపాదించకూడదు. అటువంటి సంపద సమస్యలను సృష్టిస్తుంది. అందుకే ఆ తరహాలో డబ్బు సంపాదించడం మానుకోవాలి. పేదరికం, వ్యాధులు, దుఃఖం, బానిసత్వం చెడు అలవాట్లు మొదలైవన్నీ మానవుని చర్యల ఫలితమే అని చాణక్య స్పష్టం చేశారు. ఎటువంటి విత్తనం వేస్తే అటువంటి ఫలమే లభిస్తుంది. అందుకే ఎల్లప్పుడూ సత్కార్యాలు చేయాలి. దానధర్మాలు చేయాలి. అబద్ధాలాడటంలాంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని ఆచార్య చాణక్య తెలిపారు.

Updated Date - 2022-10-02T12:19:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising