ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Maharashtra: టూరిస్ట్‌లకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి రానున్న టాయ్ ట్రెయిన్!

ABN, First Publish Date - 2022-07-24T18:55:29+05:30

మాతేరన్ హిల్ స్టేషన్.. ప్రకృతిని ఆస్వాధించడానికి ఇది బెస్ట్ ప్లేస్. ఈ పోటీ ప్రపంచంలో కాలంతో పాటు పరెగుడుతున్న నగర వాసులు సేద తీరడానికి ఇది చక్కటి ప్రదేశం. అందువల్లే.. ముంబైకి దగ్గరగా ఉన్న సందర్శించడాని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: మాతేరన్ హిల్ స్టేషన్.. ప్రకృతిని ఆస్వాధించడానికి ఇది బెస్ట్ ప్లేస్. ఈ పోటీ ప్రపంచంలో కాలంతో పాటు పరెగుడుతున్న నగర వాసులు సేద తీరడానికి ఇది చక్కటి ప్రదేశం. అందువల్లే.. ముంబైకి దగ్గరగా ఉన్న సందర్శించడానికి దేశం నలుమూల నుంచి ప్రజలు వెళ్తూ ఉంటారు. ఇపుడు దీనికి సంబంధించిన ప్రస్తావన ఎందుకు వచ్చిదంటే.. సెంట్రల్ రైల్వే అధికారులు టూరిస్టులకు గుడ్ న్యూస్ చెప్పారు. పర్యాటకులు తమ పర్యటనను మరింత ఆహ్లాందగా మార్చుకోవడానికి వీలుగా.. టాయ్ ట్రెయిన్‌గా పిలిచే మినీ రైలును తిరిగి అందుబాటులోకి తీసుకురానున్నట్టు ప్రకటించారు. నేరల్- మతేరన్‌( Neral-Matheran) ల మధ్య నారో గేజ్ పట్టాలపై నడిచే ఈ టాయ్ ట్రెయిన్.. ఈ ఏడాది చివరి నాటికి పూర్తిగా అందుబాటులోకి వస్తుందని స్పష్టం చేశారు. సుమారు రూ.5కోట్లు ఖర్చు చేసి, టాయ్ ట్రెయిన్ ఆధునికీకరించడంతోపాటు ట్రాక్‌ను పునరుద్దరిస్తున్నట్టు చెప్పారు. 



1907లో నిర్మాణం పూర్తి

 Neral-Matheran మధ్య ఈ లైన్‌ను ప్రముఖ వ్యాపార వేత్త Adamjee Peerbhoy (ఆడమ్‌జీ పీర్‌బోయ్) హయాంలో నిర్మితమైంది. ఒక ఫ్యామిలీ కుటుంబ సంస్థగా రూపుదిద్దుకున్న టాయ్ ట్రెయిన్ లైన్.. దానికి ఉన్న విశిష్టతలతో యునెస్కో (UNESCO) వరల్డ్ హెరిటేజ్ సైట్‌లో చోటు దక్కించుకుంది. మాతేరన్ హిల్స్ స్టేషన్ పర్యాటకులను  ఈ టాయ్ ట్రెయిన్ విపరీతంగా ఆకర్షించింది. కొండల నడుమ ప్రకృతి అందాలను చూస్తూ మినీ ట్రెయిన్‌లో ప్రయాణించడానికి టూరిస్ట్‌లు ఆసక్తి చూపారు. అయితే మూడేళ్ల కింద విపరీతమైన వర్షాలు కారణంగా ఈ ట్రాక్ ధ్వంసమైంది. దీంతో Neral-Matheran మధ్య ఐదు స్టేషన్ల గుండా ప్రయాణించే రైలు.. కేవలం రెండు స్టేషన్లకే పరిమితమైంది. ఈ క్రమంలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచిన టాయ్ ట్రెయిన్‌ను తిరిగి టూరిస్ట్‌లకు అందుబుటులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టింది. 


Updated Date - 2022-07-24T18:55:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising