ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈ దొంగ అందరిలా కాదు.. ఆరు రోజుల్లో లక్షల రూపాయల విలువైన చోరీ.. చివరికి ఏమైందంటే..

ABN, First Publish Date - 2022-02-17T23:59:50+05:30

హర్యానా రాష్ట్రం రోహ్‌తక్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. రోహ్‌తక్‌ ప్రాంతానికి చెందిన అషుల్ అనే వ్యక్తి కారు నడుపుకొంటూ జీవనం సాగిస్తుంటాడు. అయితే ఖర్చులు ఎక్కువ, ఆదాయం తక్కువ కావడంతో ఏదోటి చేసి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దొంగలు వివిధ రకాలుగా ఉంటారు. కొందరు ఇళ్లల్లోకి చొరబడి చోరీలు చేస్తుంటే.. మరికొందరు హైటెక్ దొంగలు కాలు కదపకుండా ఇంట్లో కూర్చునే సైబర్ నేరాలకు పాల్పడుతుంటారు. రోజురోజుకూ టెక్నాలజీ పెరిగే కొద్దీ.. దొంగలు తమ తెలివితేటలకు పదును పెడుతున్నారు. ఇంకొందరైతే, విభిన్నంగా ఆలోచించి మరీ చోరీలకు పాల్పడుతున్నారు. అసలు బండారం బయటపడ్డాక.. వామ్మో వీడేం దొంగరా నాయనా! అని అవాక్కవుతూ ఉంటాం. ఇప్పుడు చెప్పుకోబోయే దొంగ కూడా ఈ కోవకే చెందుతాడు. వివరాల్లోకి వెళితే..


హర్యానా రాష్ట్రం రోహ్‌తక్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. రోహ్‌తక్‌ ప్రాంతానికి చెందిన అషుల్ అనే వ్యక్తి కారు నడుపుకొంటూ జీవనం సాగిస్తుంటాడు. అయితే ఖర్చులు ఎక్కువ, ఆదాయం తక్కువ కావడంతో ఏదోటి చేసి.. ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కాలని నిత్యం వివిధ రకాలుగా ఆలోచించేవాడు. పెద్ద పెద్ద చోరీలు చేస్తే.. పోలీసులకు దొరికిపోతామనే భయంతో ఏదైనా కొత్తగా చేయాలని ఆలోచించాడు. ఈ క్రమంలో అతడికి ఓ ఐడియా వచ్చింది. ఇంకేముందీ వెంటనే ఆచరణలో పెట్టాడు. పెట్రోల్ బంకుల వద్దకు కారు వేసుకుని వెళ్తాడు. హుందాగా ఉండడంతో పెట్రోల్ బంక్ సిబ్బంది అతడి మాటలు నమ్మేవారు.

ఈ దంపతులు సామాన్యులు కారు.. రాత్రయిందంటే చాలు.. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద వీరు చేసే పనులు ఏంటో తెలుసా..


కారుకు పెట్రోల్ ఫుల్ చేయించడంతో పాటూ పలు క్యాన్లలో కూడా నింపుకొంటాడు. ‘‘డెబిట్, క్రెడిట్ కార్డులు పని చేయలేదు.. వెళ్లి వెంటనే నగదు తీసుకొస్తాను’’.. అంటూ బంక్ సిబ్బందిని నమ్మిస్తాడు. తర్వాత అటునుంచి అటే ఉడాయిస్తాడు. ఇలా వివిధ బంకుల్లో వారం వ్యవధిలో లక్షల రూపాయల విలువైన పెట్రోల్‌ను ఎత్తుకెళ్లాడు. ఈ క్రమంలో బుధవారం జింద్ రోడ్డులో ఉన్న పెట్రోల్ బంక్‌లో రూ.29 వేల విలువైన పెట్రోల్ కొట్టించుకుని ఉడాయించాడు. బంకు యజమాని ఫిర్యాదుతో పోలీసులు అప్రమత్తమై అషుల్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

వివాహానికి గిఫ్ట్‌‌తో రావాల్సిన మహిళ.. గన్‌తో ఎంట్రీ.. చివరకు ఆమె చేసిన పని తెలుసుకుని అంతా..

Updated Date - 2022-02-17T23:59:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising