ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మందుబాబులకు షాకింగ్ పనిష్మెంట్.. అర్ధరాత్రి వేళ మార్చురీకి తీసుకెళ్లిన పోలీసులు.. అక్కడ వారితో..

ABN, First Publish Date - 2022-01-24T00:24:20+05:30

తాగి వాహనం నడపొద్దని ఎంత చెప్పినా కొందరు మందుబాబులు వినడం లేదు. ఫైన్‌లు, జైలు శిక్షలను కూడా పట్టించుకోవడం లేదు. మద్యం సేవించి యథేచ్ఛగా రోడ్లపైకి వాహనాలను తీసుకొస్తున్నారు. ఈ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: తాగి వాహనం నడపొద్దని ఎంత చెప్పినా కొందరు మందుబాబులు వినడం లేదు. ఫైన్‌లు, జైలు శిక్షలను కూడా పట్టించుకోవడం లేదు. మద్యం సేవించి యథేచ్ఛగా రోడ్లపైకి వాహనాలను తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు వినూత్న పనిష్మెంట్ ఇచ్చారు. అదికాస్తా వర్కౌట్ కావడంతో ఇకపై దాన్నే అనుసరించాలని నిర్ణయం తీసుకున్నారు. మందుబాబులకు పోలీసులు ఇచ్చిన పనిష్మెంట్ ఏంటనే వివరాల్లోకి వెళితే.. 



మోతాదుకు మించి మద్యం సేవించి వాహనాలు నడపొద్దని పోలీసులు ఎంత చెప్పినా కొందరు మందు బాబులు లెక్కచేయకపోవడంతో వారికి పోలీసులు షాకింగ్ పనిష్మెంట్ ఇచ్చారు. తాజాగా డ్రంకెన్ డ్రైవ్ నిర్వహించిన అధికారులు.. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న సుమారు 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత వారిని అర్ధరాత్రి వేళ.. స్థానికంగా ఉన్న మార్చురీకి తీసుకెళ్లారు. అనంతరం వారితో మార్చురీ మొత్తం క్లీన్ చేయించారు. ఈ క్రమంలో కొందరు మందుబాబులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. జీవితంలో మళ్లీ మద్యం ముట్టుకోమని ప్రమాణాలు చేశారు. ఈ వినూత్న ఆలోచన వర్కౌట్ కావడంతో అధికారులు ఆనందం వ్యక్తం చేశారు. ఇకపై దీన్నే అమలు చేయనున్నట్టు ప్రకటించారు. అంతేకాకుండా మందుబాబులు మార్చురీ శుభ్రం చేస్తున్న ఫొటోలను సోషల్ మీడియాలో విడుదల చేయడంతో అవికాస్తా వైరల్‌గా మారి.. పోలీసులు తీసుకున్న చర్యలు హాట్‌టాపిక్‌గా మారాయి. అయితే ఇది జరిగింది తెలుగు రాష్ట్రాల్లో అనుకుంటే మాత్రం మీరు పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే ఈ సంఘటన జరిగింది తైవాన్‌లో కాబట్టి. దీని గురించి తెలుసుకున్న కొందరు.. ఇలాంటి వినూత్న ఆలోచనలను తెలుగు రాష్ట్రాల అధికారులు కూడా అమలు చేయాలని అభిప్రాయపడుతున్నారు.




Updated Date - 2022-01-24T00:24:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising