ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైద్యం కోసం కానిస్టేబుల్‌ను ఆశ్రయించిన యువతి.. ఆ యువతి బలహీనతను ఆసరగా చేసుకుని అతను ఏం చేశాడంటే..

ABN, First Publish Date - 2022-03-01T05:40:37+05:30

అతను ఝార్ఖండ్‌ పోలీస్ శాఖలో ఓ కానిస్టేబుల్.. మరోపక్క మూలికా వైద్యం కూడా చేస్తుంటాడు.. పలు జబ్బులకు మూలికలు ఇస్తుంటాడు. ఇటీవల ఓ యువతి అతడిని తనకు పిల్లలు పుట్టడం లేదని, పిల్లలు పుట్టేందుకు మూలికలు కావాలని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అతను ఝార్ఖండ్‌ పోలీస్ శాఖలో ఓ కానిస్టేబుల్.. మరోపక్క మూలికా వైద్యం కూడా చేస్తుంటాడు.. పలు జబ్బులకు మూలికలు ఇస్తుంటాడు. ఇటీవల ఓ యువతి అతడిని తనకు పిల్లలు పుట్టడం లేదని, పిల్లలు పుట్టేందుకు మూలికలు కావాలని అడిగింది. అయితే ఆ యువతిని ఇంటికి పిలిపించి చికిత్స పేరుతో దారుణానికి ఒడిగట్టాడు.


వివరాల్లోకి వెళితే.. ఝార్ఖండ్‌ రాష్ట్రంలోని నాగ్డి పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్ రవికుమార్ మిశ్రా మూలికా వైద్యం కూడా చేస్తుంటాడు. తనకు పిల్లలు పుట్టడం లేదని, వైద్య సహాయం కోసం ఓ యువతి రవికుమార్‌ వద్దకు వచ్చింది. ఆమె బలహీనతను ఆసరా చేసుకుని రవికుమార్ ఆమెను తన ఇంటికి పిలిపించాడు. ఆమెపై బలత్కారానికి పాల్పడ్డాడు. ఆ మహిళ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు విషయం చెప్పింది. దీంతో గ్రామస్థులందరూ కలిసి రవికుమార్‌ను చితబాదారు.


సమాచారం అందుకున్న పోలీసులు రవికుమార్‌ను వెంటనే అదుపులోకి తీసుకున్నారు. అయినా ప్రజల ఆగ్రహావేశాలు చల్లారలేదు. పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా ప్రారంభించారు. రవికుమార్‌ను తమకు అప్పగించాలని డిమాండ్లు చేస్తున్నారు. రవికుమర్ కానిస్టేబుల్ కావడంతో పోలీసులు కేసు తారుమారు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిసి గ్రామస్థులు  ఓ దశలో పోలీస్ స్టేషన్‌ను కూడా ధ్వంసం చేసేందుకు వెళ్లారు. దీంతో పోలీసులు రవికుమార్‌ను వేరే స్టేషన్‌కు తరలించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ హామీ ఇవ్వడంతో ప్రజలు శాంతించారు. 

Updated Date - 2022-03-01T05:40:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising