ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

400 కిలోమీటర్ల ఎత్తులో Pizza Party.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలు!

ABN, First Publish Date - 2022-06-05T23:53:08+05:30

పిజ్జా.. విదేశీయులు ఎక్కవ తీసుకునే ఆహార పదార్థం. ప్రస్తుతం దీని రుచి ఇండియన్లకు కూడా పరిచయం అయింది. చిన్న చిన్న పట్టణాల్లో ప్రజలు కూడా దీన్ని ఇష్టంగా తింటున్నారు. దీంతో దాదాపు అందరికీ ఇది సుపరిచి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: పిజ్జా.. విదేశీయులు ఎక్కవ తీసుకునే ఆహార పదార్థం. ప్రస్తుతం దీని రుచి ఇండియన్లకు కూడా పరిచయం అయింది. చిన్న చిన్న పట్టణాల్లో ప్రజలు కూడా దీన్ని ఇష్టంగా తింటున్నారు. దీంతో దాదాపు అందరికీ ఇది సుపరిచితం అయిపోయింది. కాగా.. కొందరు వ్యక్తులు 400 కిలోమీటర్ల ఎత్తులో పిజ్జా పార్టీ చేసుకుని.. దాని టేస్ట్‌ను ఎంజాయ్ చేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా.. అందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. 



భూమికి 400 కిలోమీటర్ల ఎత్తు.. అంటే అక్కడ ఆక్సిజన్ కూడా దొరకదు. అంతటి ఎత్తులో వ్యోమగాములు తప్ప సాధారణ ప్రజలు ఉండలేరు. అని అనుకుంటున్నారా? అవును అదే నిజం. అంతటి ఎత్తులో పిజ్జా పార్టీ చేసుకుంది కూడా ఆ వ్యోమగాములే. భూమి మీద ఉన్నప్పుడు కుటుంబ సభ్యులతో ఎలా అయితే కలసి పార్టీ చేసుకుంటారో.. అచ్చం అదే విధంగా జీరో గ్రావిటీ(గురుత్వాకర్షణ లేని ప్రదేశం) వద్ద ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌(ISS)‌లో కొందరు వ్యోమగాములు పిజ్జా టేస్టును తాజాగా ఎంజాయ్ చేశారు. అందుకు సంబంధించిన ఫొటోను నాసా తన ఇన్‌స్టాగ్రాం‌మ్ ఖాతాలో పోస్ట్ చేసింది. దీంతో ప్రస్తుతం ఆ ఫొటోలు వైరల్‌గా మారాయి. కాగా... 2021లో సిగ్నస్ అంతరిక్ష నౌక (Cygnus Spacecraft) కొన్ని పరికరాలతోపాటు పిజ్జా కిట్‌, పండ్లు, చీజ్‌ను ISSకు చేరవేసింది. 


Updated Date - 2022-06-05T23:53:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising