ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: ప్రయాణికురాలి కోసం పైలట్ అనౌన్స్‌మెంట్.. ఆ ప్రకటన ఏంటంటే?

ABN, First Publish Date - 2022-09-23T00:43:48+05:30

మహిళల్లో బ్రెస్ట్ కేన్సర్ (breast cancer) మరణాలు ఇటీవల ఒక్కసారిగా పెరిగాయి. ఒకసారి దీని బారినపడితే బయటడడం చాలా కష్టం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: మహిళల్లో బ్రెస్ట్ కేన్సర్ (breast cancer) మరణాలు ఇటీవల ఒక్కసారిగా పెరిగాయి. ఒకసారి దీని బారినపడితే బయటడడం చాలా కష్టం. చికిత్స ఉన్నప్పటికీ అప్పుడది ఏ దశలో ఉందన్న దానిపై ఆధారపడి ఉంటుంది. చివరి దశలో కనుక దానిని గుర్తిస్తే ఆశలు వదిలేసుకోవాల్సిందే. అయితే, ఓ మహిళ కేన్సర్ (breast cancer) మహమ్మారిపై పోరాడింది. కేన్సర్ చివరి దశలో ఉన్నప్పటికీ గుండె నిబ్బరంతో పోరాడి విజయం సాధించింది. తన విజయాన్ని సెలబ్రేట్ చేసుకునేందుకు వెళ్తున్న ఆమెకు  విమానంలో ఊహించని అనుభవం ఎదురైంది. హవాయి (Hawaii) వెళ్తున్న ఆమెకు పైలట్ తన అనౌన్స్‌‌తో ఆశ్చర్యపరిచాడు. తోటి ప్రయాణికులు కరతాళ ధ్వనులతో ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. గుండెలు పిండేస్తున్న ఆ పైలట్ అనౌన్స్‌మెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో షికారు చేస్తోంది. 


ఆమె పేరు జైరల్ ఓల్ధామ్ (Jyrl Oldham). సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్‌ (Southwest Airlines)లో హవాయి వెళ్తున్నారు. అంతలో పైలట్ నుంచి ఓ అనౌన్స్‌మెంట్ వినిపించింది. ‘ప్రత్యేక అతిధి’కి ‘ప్రత్యేక ఆహ్వానం’ అంటూ పైలట్ తన అనౌన్స్‌మెంట్ మొదలుపెట్టాడు. ‘‘హవాయి వెళ్తున్న ప్రయాణికురాలు ఒకరు మన మధ్యనే ఉన్నారు. చివరిదశలో ఉన్న బ్రెస్ట్ కేన్సర్‌ను ఆమె జయించారు’’ అని చెప్పగానే జైరల్ ఒక్కసారి ఆనందంతో కూడిన ఆశ్చర్యానికి లోనయ్యారు. ‘‘కేన్సర్‌తో ఆమె వీరోచితంగా పోరాడారు. దానిని తరిమికొట్టారు’’ అని పైలట్ తన ప్రసంగాన్ని ముగించాడు. అంతే జైరల్ ఒక్కసారిగా ఆనందంతో కన్నీటి పర్యంతమయ్యారు. అది విన్న విమానంలోని ప్రయాణికులు సంతోషంతో కరతాళ ధ్వనులు చేస్తూ ఆమెను అభినందించారు. 


వైరల్ అయిన ఈ వీడియోపై నెటిజన్లు అంతే గొప్పగా స్పందిస్తున్నారు. ‘ప్రయాణికురాలికి గొప్ప అనుభూతిని పంచినందుకు సౌత్‌వెస్ట్ ఎయిర్‌‌కు ధన్యవాదాలు.. దీనిని మేం ఎల్లప్పుడు స్మరించుకుంటూ ఉంటాం’ అని ఓ యూజర్ పేర్కొన్నాడు. నెటజన్ల కామెంట్లతో ఆ సెక్షన్ హోరెత్తిపోతోంది. ఆన్‌లైన్‌లో ఈ వీడియో వైరల్ అయ్యాక ఇప్పటి వరకు 6 మిలియన్లకుపైగా వ్యూస్ లభించాయి. ‘ఇది చాలా ప్రత్యేకం. ఆమె ఎప్పటికీ గుర్తుండిపోతుంది’ అని మరో యూజర్ రాసుకొచ్చాడు. ‘నిజంగా చాలా సంతోషంగా ఉంది. హృదయపూర్వక అభినందనలు’ అని ఇంకో యూజర్ కామెంట్ చేశాడు. 



Updated Date - 2022-09-23T00:43:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising