ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తాను నడుపుతున్న విమానంలో ప్రయాణిస్తున్న భార్యకు Pilot sweet announcement

ABN, First Publish Date - 2022-07-08T17:37:27+05:30

తాను నడుపుతున్న విమానంలో ప్రయాణిస్తున్న భార్య కోసం ప్రత్యేకంగా విమాన పైలట్ స్వీట్ అనౌన్స్‌మెంట్ చేసిన వింత ఉదంతం తాజాగా వెలుగుచూసింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తాను నడుపుతున్న విమానంలో ప్రయాణిస్తున్న భార్య కోసం ప్రత్యేకంగా విమాన పైలట్ స్వీట్ అనౌన్స్‌మెంట్ చేసిన వింత ఉదంతం తాజాగా వెలుగుచూసింది. టైలీ షే అనే వివాహిత ఫొటోగ్రాఫరుగా పనిచేస్తోంది. టైలీ షే భర్త విమాన పైలట్. తన భర్త నడిపే విమానంలో ప్రయాణిస్తున్న టైలీ షేకు విచిత్ర అనుభవం ఎదురైంది. ఆమె భర్త అయిన పైలట్ విమానం బయలుదేరే ముందు అనౌన్స్‌మెంట్ చేస్తూ ముందుగా ప్రయాణికులకు ఘనస్వాగతం పలికారు.‘‘ఈ విమానంలో నేనే కెప్టెన్‌ని. మీ అందరికీ సాదర స్వాగతం పలుకుతున్నాను.విమానంలోని మూడవ వరుసలో కూర్చున్న నా భార్య టైలీ షేకు ప్రత్యేక స్వాగతం. ‘‘నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నేను నడుపుతున్న విమానంలో ప్రయాణిస్తున్నందుకు ధన్యవాదాలు. మేం సమయానికి బయలుదేరాలని ఆశిస్తున్నాం’’అని పైలట్ అనౌన్స్‌మెంట్ లో పేర్కొన్నారు. 


ఆ మహిళ పైలట్ భార్య అని తెలియగానే విమానంలోని తోటి ప్రయాణికులు ఆమె కోసం చప్పట్లు కొట్టారు. పైలట్ ను వివాహం చేసుకున్న టైలీ షే కొంతకాలం క్రితం గావిన్ పర్యటనలో భాగంగా విమానంలో ఎదురైన ఈ జ్ఞాపకాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటానని పేర్కొన్నారు. పైలట్ అయిన తన భర్త ప్రత్యేకంగా చేసిన అనౌన్స్‌మెంట్ వీడియోను టైలీ షే (tylee.shay) తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు.ఈ వీడియో పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

Updated Date - 2022-07-08T17:37:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising