ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

`సార్.. నా ఎలుకను కిడ్నాప్ చేశారు.. కాస్త వెతికిపెట్టండి..` పోలీస్ స్టేషన్‌కు చేరిన వింత కేసు.. అసలేం జరిగిందంటే..

ABN, First Publish Date - 2022-10-04T00:45:58+05:30

కొంత మంది తెలిసి చేస్తారో, తెలియక చేస్తారో తెలియదు గానీ.. వారు చేసే పనులు మాత్రం చాలా వింతగా ఉంటాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొంత మంది తెలిసి చేస్తారో, తెలియక చేస్తారో తెలియదు గానీ.. వారు చేసే పనులు మాత్రం చాలా వింతగా ఉంటాయి. ఇంట్లో డబ్బులు, నగలు, విలువైన వస్తువులు పోయాయని చాలా మంది ఫిర్యాదులు చేస్తుంటారు. అయితే రాజస్థాన్‌కు చెందిన ఒక వ్యక్తి మాత్రం తన పెంపుడు ఎలుక పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంతే కాకుండా ఎత్తుకెళ్లినవారు కూడా తనకు తెలుసని చెప్పాడు. అతడి ఫిర్యాదు విని షాకైన పోలీసులు చేసేదేం లేక విచారణ ప్రారంభించారు. 


ఇది కూడా చదవండి..

Shocking Video: తరగతి గదికి మందు బాటిళ్లు తీసుకెళ్లిన ఉపాధ్యాయుడు.. ఒక వ్యక్తి నిలదీయడంతో ఏం చేశాడంటే..


రాజస్థాన్‌ (Rajasthan)లోని సజ్జన్‌గఢ్‌ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి కొన్నాళ్లుగా ఎలుకను పెంచుకుంటున్నాడు. ఇటీవల ఓ రోజు ఉదయం లేచి చూసే సరికి తన పెంపుడు ఎలుక కనిపించలేదు. దీంతో దాని గురించి చుట్టుపక్కల ప్రాంతాలన్నీ వెతికాడు. ఎక్కడ దాని ఆచూకీ దొరకలేదు. దీంతో నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు విన్న పోలీసులు షాక్ అయ్యారు. తన పెంపుడు ఎలుక కనిపించకుండా పోయిందని, దాని బరువు 700 గ్రాములు ఉంటుందని ఫిర్యాదు చేశాడు. 


అంతేకాదు తన సోదరుడి ముగ్గురు కుమారులపైనే అనుమానం ఉందని, వారే ఎలుకను కిడ్నాప్ చేసి ఉంటారని పోలీసులకు తెలిపాడు. చివరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఆ వ్యక్తి అనుమానం వ్యక్తం చేసిన ముగ్గురుని ప్రశ్నిస్తున్నారు. కాగా, ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

Updated Date - 2022-10-04T00:45:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising