ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ పార్కులో పెంపుడు కుక్కలకు నో ఎంట్రీ

ABN, First Publish Date - 2022-06-29T17:22:23+05:30

ఉదయాన్నే సరదాగా తమ పెంపుడు కుక్కలతో జాగింగ్‌ కు వెళ్లడాన్ని నగరంలో రోజూ చూస్తుంటాం. అయితే ఇకపై అలా కుదరదు. నగర వాసుల వ్యాహాళికి పెట్టింది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- 1 నుంచి అమలు

- ఫిర్యాదుల నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయం


బెంగళూరు, జూన్‌ 28: ఉదయాన్నే సరదాగా తమ పెంపుడు కుక్కలతో జాగింగ్‌ కు వెళ్లడాన్ని నగరంలో రోజూ చూస్తుంటాం. అయితే ఇకపై అలా కుదరదు. నగర వాసుల వ్యాహాళికి పెట్టింది పేరుగా ఉన్న కబ్బన్‌పార్కులో ఇకపై పెంపుడుకుక్కలను అ నుమతించరు. సాధారణంగా ఉదయం, సాయంత్రం వేళల్లో వాకింగ్‌, జాగింగ్‌కు వచ్చేవారు తమ పెంపుడు కుక్కలను కూడా తీసుకొస్తుంటారు. అయితే ఇకపై పార్కులోకి పెంపుడు కుక్కలను తీసుకురావడాన్ని నిషేధిస్తూ ప్రభుత్వం నిర్ణయించినట్లు కబ్బన్‌పార్క్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ బాలకృష్ణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలనుంచి ఫిర్యాదులు రావడంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. కొన్నిసార్లు కుక్కల కారణంగా కొందరు ఇబ్బంది పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చినట్లు తెలిసిందన్నారు. జూలై 1నుంచి ఈ నిబంధన అమలులోకి రానుందన్నారు. ఇందుకు సంబంధించి ప్రజలకు అవగాహన కల్పించేలా బ్యానర్‌లను ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. నగర పౌరులందరూ గమనించి పెంపుడు కుక్కలు లేకుండానే వ్యాహాళికి రావాలని ఆయన సూచించారు.

Updated Date - 2022-06-29T17:22:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising