ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పక్కింటి పాపపై దాడి చేసిన పెంపుడు కుక్క.. ఆ తరువాత జరిగిన గొడవలో కుక్క యజమాని ఎంత దారుణం చేశాడంటే..

ABN, First Publish Date - 2022-02-11T05:56:59+05:30

రోడ్డుపై వెళుతున్న ఒక పాపపై ఒక పెంపుడు కుక్క దాడి చేసింది. ఈ దాడిలో పాపకు తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన తరువాత పాప తల్లి కుక్క యజమాని ఇంటికి వెళ్లి కుక్కను బంధించి ఉంచాలని సూచించింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రోడ్డుపై వెళుతున్న ఒక పాపపై ఒక పెంపుడు కుక్క దాడి చేసింది. ఈ దాడిలో పాపకు తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన తరువాత పాప తల్లి కుక్క యజమాని ఇంటికి వెళ్లి కుక్కను బంధించి ఉంచాలని సూచించింది. దీంతో కుక్క యజమాని ఆమెతో గొడవకు దిగాడు. ఆ గొడవలో ఇద్దరూ ఒకరినొకరు దూషించుకున్నారు. అలా గొడవ పెద్దదై ఆ కుక్క యజమాని కోపంలో పాప తల్లిని ఏం చేశాడంటే..


వివరాల్లోకి వెళితే.. దేశ రాజధాని ఢిల్లీలోని బిందాపూర్ ప్రాంతంలో నివసించే ఒక మహిళ ఇటీవల తన పాపతో కలిసి సాయంత్రం బయటికి వెళ్లింది. తిరిగి ఇంటికి వస్తుండగా.. మహిళ పక్కింటి పెంపుడు కుక్క పాపపై దాడి చేసింది. ఈ దాడిలో పాప తీవ్రంగా గాయపడింది. పాపను ఆస్పత్రిలో చికిత్స చేయించి తిరిగివచ్చాక.. ఆ మహిళ కుక్క యజమాని ఇంటకి వెళ్లింది. అక్కడ కుక్కను బంధించి ఉంచాలని లేకపోతే మున్సిపాలిటీ వారికి ఫోన్ చేస్తానని చెప్పింది. ఆమె మాటలు కుక్క యజమనికి ఆగ్రహం తెప్పించాయి. దీంతో ఇద్దరూ ఒకరినొకరు దూషించుకున్నారు. 


ఈ క్రమంలో కుక్క యజమని పట్టలేని కోపంతో ఆ మహిళను ఇంట్లోకి బలవంతంగా తీసుకెళ్లి ఆమెపై అత్యాచారం చేశాడు. ఆ తరువాత ఆమెను చితకబాది వదిలేశాడు. దీంతో మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు విచారణ చేసేందుకు కుక్క యజమాని ఇంటికి వెళ్లగా.. అతను పరారీలో ఉన్నాడు. అత్యాచారం జరిగిన మహిళకు పోలీసులు మెడికల్ పరీక్ష చేయించి.. అత్యాచారం కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Updated Date - 2022-02-11T05:56:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising