ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Selfie: ఏనుగులతో సెల్ఫీల కోసం కారు దిగిన యువకులు.. తర్వాత జరిగింది తెలిస్తే..

ABN, First Publish Date - 2022-08-07T23:23:41+05:30

రోడ్డు దాటుతున్న ఏనుగుల మందతో సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించిన యువకుల వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: రోడ్డు దాటుతున్న ఏనుగుల మందతో సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించిన యువకుల వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతోంది. వేగంగా వెళ్తున్న కారు రోడ్డు దాటుతున్న ఏనుగుల మందను చూసి ఆగింది. ఆ వెంటనే అందులోంచి కిందికి దిగిన యువకులు ఏనుగులతో సెల్ఫీలు తీసుకునేందుకు ప్రయత్నించారు.


ఐఏఎస్ అధికారి సుప్రియా సాహు ట్విట్టర్‌లో పంచుకున్న ఈ వీడియో నెటిజన్లను షాక్‌కు గురిచేస్తోంది. కారును రోడ్డు మధ్యలో ఆపిన యువకులు ఏనుగులను ఫొటోలు తీశారు. ఇద్దరు యువకులు మాత్రం ఏనుగులకు మరింత దగ్గరగా వెళ్లి సెల్ఫీలు తీసుకోవడం మొదలుపెట్టాడు. రోడ్డు దాటబోతున్న ఏనుగులు యువకులను గమనించి ఒక్క క్షణం ఆగాయి. ఆ వెంటనే పరుగులు పెడుతూ యువకులపైకి దూసుకొచ్చాయి. అంతే.. యువకులు భయంతో కారువైపు పరుగులు తీయడం మొదలుపెట్టారు.


ఈ వీడియోను షేర్ చేసిన సుప్రియా సాహు.. వన్యప్రాణులతో సెల్ఫీ క్రేజీ చాలా ప్రమాదకరం. ఈ యువకులు చాలా అదృష్టవంతులు. ఈ ఏనుగులు వారి చర్యను క్షమించి వదిలేశాయి. లేదంటే, వారికి గుణపాఠం చెప్పడానికి వాటికి ఎంతో సమయం పట్టేది కాదు’’ అని రాసుకొచ్చారు. ఇప్పటికే ఈ వీడియోను దాదాపు 65 వేల మంది చూశారు. నెటిజన్లు కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. యువకుల తీరుపై మండిపడుతున్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఇలాంటి ఘటనలు జరగకుండా యానిమల్ కారిడార్లు ఏర్పాటు చేయాలని అటవీశాఖను కోరుతున్నారు. 




Updated Date - 2022-08-07T23:23:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising