ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: రైల్లో మొబైల్ కొట్టేయాలని చూసిన దొంగకు చుక్కలు చూపించిన ప్రయాణీకులు.. తలుపుల వద్దే బయటకు వేళాడదీసి..

ABN, First Publish Date - 2022-09-30T00:16:28+05:30

చోరీలు చేసే క్రమంలో ఒక్కోసారి కథ అడ్డం తిరుగుతుంటుంది. ఎంత చేయి తిరిగిన దొంగ అయినా.. కొన్నిసార్లు అనుకోని ప్రమాదాలకు గురవడం, లేదా జనం చేతికి చిక్కి తన్నులు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చోరీలు చేసే క్రమంలో ఒక్కోసారి కథ అడ్డం తిరుగుతుంటుంది. ఎంత చేయి తిరిగిన దొంగ అయినా.. కొన్నిసార్లు అనుకోని ప్రమాదాలకు గురవడం, లేదా జనం చేతికి చిక్కి తన్నులు తినడం జరుగుతుంటుంది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో కూడా (Viral videos) ఇలాంటిదే. రైల్లో మొబైల్ కొట్టేయాలని చూసిన దొంగకు ప్రయాణికులు చుక్కలు చూపించారు. తలుపుల వద్ద బయటకు వేళాడదీసి మరీ బడితపూజ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.


బీహార్‌లోని (Bihar) భాగల్‌పూర్ సాహెబ్‌గంజ్ పరిధి మమల్కా రైల్వే స్టేషన్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. రైలు కదులుతుండగా ఓ ప్రయాణికుడు ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు. అదే సమయంలో ఓ దొంగ దాన్ని కొట్టేయాలని కాసుకు కూర్చున్నాడు. తీరా రైలు స్టార్ట్ అవగానే మొబైల్ లాక్కున్నాడు. అయితే అదే సమయంలో అక్కడే ఉన్న ప్రయాణికులు గమనించి.. అతడి చేయిని గట్టిగా పట్టుకున్నారు. ఇంకేముందీ.. అంతా కలిసి మూకుమ్మడిగా పిడిగుద్దులు కురిపించారు. అంతటితో ఆగకుండా తలుపుల వద్ద కిటికీ నుంచి చేతులు పట్టుకుని బయటికి వేలాడదీశారు.

Lottery ticket: పుట్టిన తేదీ, నెల, సంవత్సరం ఆధారంగా.. లాటరీ టికెట్లు కొన్న వ్యక్తి పరిస్థితి.. చివరకు ఏమైందంటే..


సుమారు పది కిలోమీటర్ల పాటు అలాగే వేలాడదీసి, మరోవైపు కొట్టుకుంటూ వెళ్లారు. ఆ సమయంలో రైలు సుమారు 80 నుంచి 100కిలోమీటర్ల వేగంతో వెళ్తోంది. బోగీలో ఉన్న మిగతా ప్రయాణికులు కిటికీల్లోంచి ఈ ఘటనను వీడియోలు తీశారు. 15రోజుల క్రితం బెగుసరాయ్‌లో కూడా ఇలాగే జరిగింది. కదులుతున్న రైలు నుంచి ఫోన్ కొట్టేయాలని చూసిన దొంగను ఇలాగే.. కిటికీకి వేలాడదీసి, సుమారు 15కిలోమీటర్ల  మీర కొట్టుకుంటూ వెళ్లారు. బెగుసరాయ్‌లోని సాహెబ్‌పూర్ కమల్ స్టేషన్ నుంచి ఖగారియా అనే ప్రాంతం వరకు ఇలాగే తీసుకెళ్లారు. తర్వాత పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఈ వీడియోలు చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు పెడుతున్నారు.

శ్రీనివాస రామానుజన్ మళ్లీ పుట్టారా..? ఈ బాలుడు చదివేది 3వ తరగతే.. కానీ పదో తరగతి విద్యార్థులకు కూడా లెక్కల పాఠాలు..!







Updated Date - 2022-09-30T00:16:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising