ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బిజినెస్ డీల్ అంటూ హోటల్‌కు పిలిచి కాఫీ ఇచ్చిన భాగస్వామి.. ఆ తర్వాత ఆమె పరిస్థితి ఏంటంటే..

ABN, First Publish Date - 2022-10-15T21:47:19+05:30

ఆ మహిళ వయసు 42 సంవత్సరాలు.. ఆమె జైపూర్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త.. జైపూర్ నగరంలో లాండ్రీ వ్యాపారం చేస్తుంటుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆ మహిళ వయసు 42 సంవత్సరాలు.. ఆమె జైపూర్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త.. జైపూర్ నగరంలో లాండ్రీ వ్యాపారం చేస్తుంటుంది.. ఆ బిజినెస్ బాగా విజయవంతమైంది.. 2018 జనవరిలో మరో వ్యక్తి ఆమె వ్యాపారంలో పెట్టుబడి పెట్టి భాగస్వామిగా మారాడు.. అలాంటి బిజినెస్‌ను ఛత్తీస్‌గఢ్‌లో కూడా ప్రారంభిద్దామని చెప్పాడు.. దీంతో ఆ మహిళ అతడితో కలిసి ఛత్తీస్‌గఢ్ వెళ్లింది.. అక్కడ ఓ హోటళ్లో ఆమెకు ఆ వ్యక్తి కాఫీలో మత్తు మందు కలిపి ఇచ్చాడు.. స్పృహలో లేని ఆమెపై మరో ఇద్దరితో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు.. ఆ ఘటన మొత్తాన్ని వీడియో తీయించాడు.. ఆ వీడియోతో ఆమెను బెదిరించడం ప్రారంభించాడు. 


ఇది కూడా చదవండి..

Triple Talaq: కట్నంగా కారు ఇవ్వలేదని ఆగ్రహం.. భార్యకు ఫోన్ చేసి ట్రిపుల్ తలాక్ చెప్పిన భర్త..!


జైపూర్‌లోని వైశాలి నగర్‌కు చెందిన 42 ఏళ్ల మహిళ నగరంలో లాండ్రీ వ్యాపారం చేస్తుంటుంది. ఆమెకు 2018 జనవరిలో ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా నీరజ్ అగర్వాల్ (43)తో పరిచయం ఏర్పడింది. తనకు చాలా వ్యాపారాలు ఉన్నాయని ఆమెను నీరజ్ నమ్మించాడు. కొంత పెట్టుబడి పెట్టి ఆ మహిళ వ్యాపారంలో భాగస్వామిగా మారాడు. అంతేకాదు ఆ బిజినెస్‌ను వేరే నగరాలకు విస్తరిస్తే భారీ లాభాలు వస్తాయని నమ్మించాడు. రాయ్‌పూర్ (ఛత్తీస్‌గఢ్)లో ఓ బ్రాంచ్‌ను తెరవాలని కోరాడు. దీంతో బాధిత మహిళ రాయ్‌పూర్ వెళ్లింది. అక్కడ ఓ హోటళ్లో సమావేశం జరిగింది. ఆ సమయంలో బాధిత మహిళకు నీరజ్ కాఫీ కలిపి ఇచ్చాడు. 


కాఫీ తాగగానే బాధితురాలు స్పృహ తప్పింది. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెపై నిందితుడు నీరజ్ మరో ఇద్దరితో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ ఘటన మొత్తాన్ని మొబైల్‌లో రికార్డు చేశాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే ఫొటోలు, వీడియోలు వైరల్ చేస్తానని బెదిరించాడు. దీంతో బాధితురాలు మౌనంగా ఉండిపోయింది. ఆ వీడియో చూపించి బ్లాక్‌మెయిల్ చేస్తూ బాధితురాలిని రెండు నెలలకు ఒకసారి రాయ్‌పూర్‌కు పిలిపించి అత్యాచారం చేశాడు. మానసిక, శారీరక హింసలతో కలత చెందిన బాధితురాలు నిందితులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. 

Updated Date - 2022-10-15T21:47:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising