వీళ్లసలు తల్లిదండ్రులేనా..? 2 నెలల బిడ్డను రోడ్డుపై వదిలేసి ఇదేం పని.. సీసీ కెమెరాలో రికార్డైన వీడియోతో..!
ABN, First Publish Date - 2022-12-31T16:07:14+05:30
అభం శుభం తెలియని చిన్నారి పట్ల కన్న తల్లిదండ్రులు అత్యంత కర్కశంగా ప్రవర్తించారు. అర్ధరాత్రి నడిరోడ్డుపై ఆ చిన్నారిని వదిలేసి పరారైయ్యారు.. బిడ్డను వదిలేసి వారు రైలు ఎక్కుతున్న దృశ్యం సీసీటీవీ కెమేరాలో రికార్డు అయింది..
అభం శుభం తెలియని చిన్నారి పట్ల కన్న తల్లిదండ్రులు అత్యంత కర్కశంగా ప్రవర్తించారు. అర్ధరాత్రి నడిరోడ్డుపై ఆ చిన్నారిని వదిలేసి పరారైయ్యారు.. బిడ్డను వదిలేసి వారు రైలు ఎక్కుతున్న దృశ్యం సీసీటీవీ కెమేరాలో రికార్డు అయింది.. ఆ బిడ్డను చైల్డ్ కేర్‌కు తరలించిన పోలీసులు తల్లిదండ్రుల కోసం అన్వేషణ ప్రారంభించారు.. గుజరాత్‌లోని సూరత్‌లో (Surat News) సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది.
సోమవారం రాత్రి 10.30 గంటలకు సూరత్‌లోని కేబుల్ బ్రిడ్జిపై ఉన్న రెండు నెలల చిన్నారి గురించి పోలీసులకు సమాచారం అందించారు. బ్రిడ్జిపై రెండు నెలల పాప ఏడుస్తూ కనిపించడంతో పోలీసులు వెంటనే ఆ చిన్నారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బ్రిడ్జిపై అమర్చిన సీసీటీవీని పరిశీలించగా.. బ్రిడ్జిపై ఓ పురుషుడు, మహిళ ఆ చిన్నారిని వదిలి వెళ్తున్నట్లు కనిపించింది (Parents leaves their two-month-old child on road). సీసీటీవీ కెమేరాల ద్వారా వారిని ట్రేస్ చేయగా.. వారు రిక్షా ఎక్కి సూరత్ రైల్వే స్టేషన్‌కు వెళ్లారని, అక్కడి నుంచి వల్సాద్ వెళ్లే రైలు ఎక్కారని పోలీసులు కనుగొన్నారు. ఆ చిన్నారి తల్లిదండ్రులిద్దరూ సూరత్, వల్సాద్ మధ్య ఏదో ఒక ఊరిలో నివసిస్తున్నారని పోలీసులు భావిస్తున్నారు. వారిని కనుగొనేందుకు ప్రయత్నాలు ముమ్మురం చేశారు.
Updated Date - 2022-12-31T16:07:16+05:30 IST