ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మన చేతి రేఖలు ఎప్పటికప్పుడు మారుతుంటాయని మీకు తెలుసా? మరి హస్త సాముద్రికం మాటేమిటి?

ABN, First Publish Date - 2022-02-26T15:12:41+05:30

తమ భవిష్యత్తు గురించి తెలుసుకోవాలనే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తమ భవిష్యత్తు గురించి తెలుసుకోవాలనే కోరిక చాలా  మందికి ఉంటుంది. అందుకే భవిష్యత్‌ను తెలుసుకునేందుకు  అనేక రకాల మార్గాలను ఆశ్రయిస్తుంటారు. వాటిలో హస్త సాముద్రికం ఒకటి. దీని సహాయంతో ఒక వ్యక్తి తన మున్ముందు జీవితం గురించి తెలుసుకోవచ్చని చెబుతారు. శిశువు జన్మించినప్పుడు.. ఆశిశువు చేతిలోని రేఖలు కాలక్రమేణా ముదురు రంగులోకి మారుతాయని సైన్స్ చెబుతోంది. చాలా మంది మన చేతులపై ఉన్న రేఖలు మారుతుంటాయా? లేదా జీవితాంతం అలాగే ఉంటాయా? అనేది తెలుసుకోవాలనుకుంటారు. 


నిజానికి మన హస్త రేఖలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. మన చేతి రేఖలు మనకు జీవితంలో ఎదురయ్యే కష్టాలను, ఆనందాలను తెలియజేస్తాయని హస్తసాముద్రికం చెబుతుంటుంది. మనిషి వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? ఎంత డబ్బు ఉంటుంది? జీవితంలో ఎటువంటి కష్టాలు  ఎదురవుతాయి? భవిష్యత్తులో మనం ఎప్పుడు విజయం సాధిస్తాం? మొదలైన విషయాలను హస్తసాముద్రికం ద్వారా తెలుసుకోవచ్చని చెబుతుంటారు. కొందరు వ్యక్తులు హస్తసాముద్రికాన్ని విశ్వస్తుండగా, మరి కొందరు హస్తరేఖలు మారుతుంటాయంటూ.. వాటిని సైన్స్ కోణంలో చూస్తుంటారు. దేశంలో హస్తసాముద్రికాన్ని నమ్ముకునేవారు అధికంగానే ఉన్నారు. కాగా చేతి రేఖలను చూసి భవిష్యత్తు గొప్పగా ఉందని చెబితే వారు బద్దకం బారిన పడే అవకాశం ఉంటుందనే వారు కూడా ఉన్నారు. ఒక భవిష్యత్తు బాగుండదని చెబితే వారి మనసులో ఎప్పటికీ టెన్షన్ నెలకొంటుందనే వాదన వినిపిస్తుంటుంది.

Updated Date - 2022-02-26T15:12:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising