ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆన్‌లైన్‌లో ఏదైనా ఆర్డర్ చేశాక అది ఇంటికి రాకపోతే ఏం చేయాలి? ఎవరికి ఫిర్యాదు చేయాలంటే..

ABN, First Publish Date - 2022-05-24T15:45:43+05:30

ఇప్పుడు చాలామంది ఆన్‌లైన్ షాపింగ్ ద్వారా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇప్పుడు చాలామంది ఆన్‌లైన్ షాపింగ్ ద్వారా వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల సాయంతో ఇంటికి రేషన్, పాల ప్యాకెట్లను కూడా ఆర్డర్ చేస్తున్నారు. ఆన్‌లైన్ షాపింగ్ ద్వారా జనానికి చాలా సౌకర్యాలు లభిస్తున్నాయి. అయితే ఈ నేపధ్యంలో పలు ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయి. ఇందులో ఒక ఇబ్బంది ఏమిటంటే.. సరుకులు ఆర్డర్ చేసి డబ్బులు జమ చేసిన తర్వాత కూడా ఆ సరుకులు వినియోగదారులకు చేరవు.


ఇలాంటి పరిస్థితుల్లో ఎలా? ఎక్కడ ఫిర్యాదు చేయాలని పలువురు సతమతమవుతుంటారు. ఇటువంటి పరిస్థితి మీకు ఎదురైతే మొదట మీరు ఆ కంపెనీ నిబంధనల ప్రకారం సమస్యను పరిష్కరించుకోవచ్చు. మెయిల్ ద్వారా లేదా ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో కంపెనీకి ఫిర్యాదు చేయవచ్చు. అయితే అప్పటికీ మీ సమస్య పరిష్కారం కాకపోతే, మీరు వినియోగదారుల ఫోరమ్‌లో ఫిర్యాదు చేయాల్సివుంటుంది. ఏదైనా సరఫరాదారు లేదా కంపెనీ మీకు సమయానికి వస్తువులను అందించేకపోతే అప్పుడు ఆ కంపెనీదే బాధ్యత అవుతుంది. ఇదేవిధంగా టోల్ ఫ్రీ నంబర్ 14404 లేదా 1800-11-4000కి కాల్ చేయడం ద్వారా కూడా మీ సమస్యపై ఫిర్యాదు చేయవచ్చు. అలాగే కస్టమర్ నంబర్ 8130009809కి ఎస్ఎంఎస్ పంపడం ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు. ఎస్ఎంఎస్ అందుకున్న తర్వాత సదరు కంపెనీ వినియోగదారునికి కాల్ చేస్తుంది. వారి ఫిర్యాదును నమోదు చేసుకుని పరిష్కరిస్తుంది.

Updated Date - 2022-05-24T15:45:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising