ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: మొసలిని పెళ్లాడిన Mayor.. వేడుకకు తండోపతండాలుగా తరలి వెళ్లిన జనం.. కారణం తెలిసి షాకవుతున్న నెటిజన్లు!

ABN, First Publish Date - 2022-07-02T16:55:45+05:30

ఆయన ప్రజాప్రతినిధి. సాధారణ ప్రజలతోపాటు అధికారులు కూడా ఆయన ఆదేశాలను అనుసరిస్తారు. కానీ ఆయన ఓ మొసలిని పెళ్లి చేసుకున్నాడు. వినడానికి షాకింగ్‌గా అనిపించినా ఇది నిజం. ఇక్కడ ఇంకొక ఆశ్చర్యకరమై

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: ఆయన ప్రజాప్రతినిధి. సాధారణ ప్రజలతోపాటు అధికారులు కూడా ఆయన ఆదేశాలను అనుసరిస్తారు. కానీ ఆయన ఓ మొసలిని పెళ్లి చేసుకున్నాడు. వినడానికి షాకింగ్‌గా అనిపించినా ఇది నిజం. ఇక్కడ ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఆయన పెళ్లి వేడుకకు మీడియా ప్రతినిధులతోపాటు, సాధారణ జనం కూడా తండోపతండాలుగా తరలి వెళ్లారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీంతో నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. మొసలిని పెళ్లి చేసుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. 



మెక్సికోలోని శాన్ పెడ్రో హుమేలులా నగర మేయర్ క్వెటర్ హ్యూగో స్థానిక సంప్రదాయం ప్రకారం.. మొసలి పిల్లను వివాహమాడారు. ఈ పెళ్లి వేడుకను వీక్షించేందుకు భారీ మొత్తంలో జనం తరలివచ్చారు. మేయర్ ఇలా చేయడం వెనక మంచి ఉద్దేశం ఉందట. పర్యావరణ హితం కోరే ఇలా మొసలిని పెళ్లి చేసుకున్నాడట. దాన్ని పెళ్లి చేసుకోవడం ద్వారా కోరికలు నెరవేరడంతోపాటు మంచి వర్షాలు కురిస్తాయని ఇక్కడి ప్రజలు విశ్వాసం. మత్య్సకారులకు పెద్ద మొత్తంలో చేపలు లభించి వారి ఆర్థిక పరిస్థితి బాగుపడుతుందని గట్టిగా నమ్ముతున్నారు. ఈ ఆచారం ఇక్కడ 1789 నుంచే కొనసాగుతోందని అక్కడ ప్రజలు చెబుతున్నారు. కాగా.. ఇలాంటి ఆచారాలను తెలంగాణలో కూడా చూడొచ్చు. వర్షాలు ఆలస్యం అయితే తెలంగాణ గ్రామ ప్రజలు.. కప్పలకు పెళ్లి చేసి వాటిని గ్రామం మొత్తం ఊరేగించడం ఇక్కడ కనిపిస్తుంది. 


వీడియో: వాయిస్ ఆఫ్ అమెరికా సౌజన్యంతో



Updated Date - 2022-07-02T16:55:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising