ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అతి పెద్ద Royal Bengal Tiger మృతి

ABN, First Publish Date - 2022-07-12T13:22:47+05:30

దేశంలోనే అతి పెద్ద రాయల్ బెంగాల్ పులి 25 ఏళ్లకు పైగా వయసులో మరణించింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కళేబరానికి అటవీశాఖ అధికారుల వీడ్కోలు

కోల్‌కతా(పశ్చిమబెంగాల్): దేశంలోనే అతి పెద్ద రాయల్ బెంగాల్ పులి 25 ఏళ్లకు పైగా వయసులో మరణించింది. పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలోని అలీపుర్‌దువార్ జిల్లాలో వృద్ధాప్యంతో మరణించిన అరుదైన రాయల్ బెంగాల్ పులి రాజాకు అటవీ అధికారులు తుది వీడ్కోలు పలికారు. అటవీశాఖ ఉద్యోగులు పులి కళేబరంపై పుష్పగుచ్చాలు ఉంచి నివాళులు అర్పించారు. గత ఏడాది ఆగస్టు 23వతేదీన ఈ పులి పుట్టిన రోజు వేడుకలను అటవీశాఖ అధికారులు వైభవంగా జరిపారు.2008వ సంవత్సరంలో సుందర్‌బన్స్‌లోని మాట్లా నదిని దాటుతుండగా మొసలి దాడి చేయడంతో రాజా అనే పులికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో 2008వ సంవత్సరం నుంచి సౌత్ ఖైర్‌బారి టైగర్ రెస్క్యూ సెంటరుకు పులిని ఉంచారు. మొసలి దాడి నుంచి బయటపడిన తర్వాత కృత్రిమ అవయవాలపై ఈ పులి నడిచిందని చీఫ్ వైల్డ్‌లైఫ్ వార్డెన్ దేబాల్ రాయ్ చెప్పారు.


పులి రాజాకు తీవ్రమైన అనారోగ్యం లక్షణాలు కనిపించలేదని, అది మరణానికి వృద్ధాప్య సంబంధిత సమస్యలే కారణమని పశువైద్యులు నిర్ధారించారని రాయ్ వివరించారు.25 సంవత్సరాల 10 నెలల వయస్సులో మరణించిన రాజా రాయల్ బెంగాల్ టైగర్‌లోనూ అతి పెద్దది పెద్దది.పెద్ద పులులు సాధారణంగా 20 ఏళ్లకు మించి జీవించవని, కాని రాయల్ బెంగాల్ పులి 25 ఏళ్లకు పైగా జీవించిందని అటవీశాఖ అధికారులు చెప్పారు. మరణించిన పులిని కీపర్లు, పశువైద్యులు బాగా చూసుకునే వారని రాయ్ చెప్పారు.

Updated Date - 2022-07-12T13:22:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising