ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేశంలో పెరుగుతున్న ఊబకాయులు... భయపెడుతున్న గణాంకాలు!

ABN, First Publish Date - 2022-06-28T15:21:47+05:30

ఇటీవలి కాలంలో చాలామంది తరచూ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇటీవలి కాలంలో చాలామంది తరచూ ఒక విషయం గురించి ఎక్కువగా చర్చించుకుంటున్నారు. అదే ఊబకాయం. ఆఫీసు అయినా, ఇల్లు అయినా లేదా పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ అయినా... ఇలా అన్ని చోట్లా ఊబకాయం గురించే మాట్లాడుకుంటున్నారు. చాలా మంది తాము లావు అవుతున్నామని లేదా లావు అయ్యామని అనుకుంటారు. మీరు కూడా ఇలా అనుకుంటూ ఉండవచ్చు. భారతదేశంలో చాలా మంది ఊబకాయంతో బాధపడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. దేశంలో స్థూలకాయం అనేది ముఖ్యమైన శారీరక సమస్యలలో ఒకటిగా మారుతోంది. దీనికి సంబంధించిన గణాంకాలను చూస్తే, ఈ సమస్య ఎంత ప్రధానమైదిగా మారిందో, భారతదేశంలో ఎంత మంది ఈ సమస్యను ఎదుర్కొంటున్నారో అర్థం చేసుకోవచ్చు. బిబిసి నివేదిక ప్రకారం భారతీయులు మరింత ఊబకాయులుగా మారుతున్నారు. ఈ సమస్యను త్వరగా గుర్తించకపోతే అది ఆరోగ్య అత్యవసర పరిస్థితికి దారితీస్తుందని నిపుణులు అంటున్నారు. పాశ్చాత్య దేశాలలో ఒక ముఖ్యమైన సమస్యగా పరిగణించబడుతున్న ఊబకాయ సమస్య ఇప్పుడు మధ్య ఆదాయ దేశాల వైపు కూడా కదులుతోంది. 


భారతదేశంలో ఊబకాయుల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. ఒకప్పుడు బరువు తక్కువగా ఉన్నవారు ఎక్కువగా ఉన్న దేశాల్లో భారతదేశం ఒకటైతే, ఇప్పుడు ఊబకాయంతో కూడిన టాప్-5 దేశాల్లో భారత్ పేరు నమోదయ్యింది. ఇక గణాంకాల విషయానికొస్తే 2016 సంవత్సరం గణాంకాల ప్రకారం, భారతదేశంలో 135 మిలియన్ల మంది ప్రజలు ఊబకాయంతో బాధపడుతున్నారు. నిరంతరం వీరి సంఖ్య పెరుగుతోంది. ఇటీవల విడుదలైన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే డేటా ప్రకారం, 23 శాతం మంది పురుషులు, 24 మంది స్త్రీలు బీఎంఐ 25 లేదా అంతకంటే ఎక్కువ కలిగి ఉన్నారు. ఈ సమస్య పిల్లలలో కూడా కనిపిస్తోంది. 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలలో 3.4 శాతం మంది ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. 2015-16 సంవత్సరంలో భారతదేశంలో 2.1 శాతం మంది పిల్లలు అధిక బరువుతో ఉన్నారు, అది ఇప్పుడు 3.4 శాతానికి పెరిగింది. మహిళల్లో ఊబకాయుల సంఖ్య పెరిగింది. అంతకుముందు 20.6 శాతం మంది మహిళలు ఊబకాయంతో ఉన్నారు. ఇప్పుడు 2019-20 నాటికి ఈ తరహా మహిళల శాతం 24కి పెరిగింది. స్థూలకాయం పెరిగే కొద్దీ అనేక రకాల వ్యాధులు కూడా చుట్టుముడతాయి. ప్రపంచ ఆరోగ్యం సంస్థ నివేదిక ప్రకారం అధిక స్థూలకాయం కారణంగా 13 రకాల క్యాన్సర్, టైప్-2 మధుమేహం, గుండె సమస్యలు, అంగస్తంభన సమస్యలు తలెత్తులాయి. గత సంవత్సరంలో సుమారు 28 లక్షల మంది మరణానికి ఊబకాయం కారణంగా నిలిచింది. 

Updated Date - 2022-06-28T15:21:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising